పర్యావరణ రక్షణకు మట్టి గణపతులు ఉపయోగపడతాయి ** జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ** జిల్లా సంక్షేమ శా

Published: Tuesday August 30, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు29 (ప్రజాపాలన, ప్రతినిధి) : పర్యావరణ పరిరక్షణకు మట్టి గణపతులు ఎంతగానో ఉపయోగపడతాయని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 1000 మట్టి గణపతులు పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా పరిషత్ చైర్పర్సన్ కోవ లక్ష్మితో కలిసి బస్టాండు ఎదుట, కలెక్టరేట్ కార్యాలయ ఆవరణలో అధికారులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్లాస్టిక్ ఆఫ్ ప్యారిస్ తో తయారు చేసిన గణపతి వల్ల పర్యావరణ సమతుల్యం దెబ్బతింటుందన్నారు. ప్రజలు మట్టి గణపతులు వాడేలా  అవగాహన కల్పించాలని సూచించారు.
 బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా 1000 చిన్న గణపతులు మండలాల్లో తక్కువ ధరకు పెద్ద మట్టి గణపతి 3000 కు పంపిణీ చేస్తున్నట్టు వివరించారు. ఈ కార్యక్రమంలో కేరిమేరి జడ్పిటిసి ద్రుపద భాయి, ఎంపీపీ మల్లికార్జున్, సింగిల్విండో చైర్మన్ అలీ బిన్ అహ్మద్, సత్యనారాయణ రెడ్డి, కుమ్మరుల సంఘం అధ్యక్షుడు మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.