రెండున్నర కోట్ల కుంభకోణం పై విచారణ జరిపించాలి : పేరం శ్రీనివాస్ ఐఎన్టియుసి

Published: Tuesday October 12, 2021
బెల్లంపల్లి, అక్టోబర్ 11, ప్రజాపాలన ప్రతినిధి : బెల్లంపల్లి ఏరియాలోని సింగరేణి సంస్థ ప్రైవేటు సెక్యూరిటీ గార్డు ఉద్యోగాల నియామకాల్లో దాదాపు 2కొట్ల 50 లక్షల రూపాయల కుంభకోణం జరిగిందనీ దీని పై తక్షణమే విచారణ జరిపించి దోషులను శిక్షించాలని బెల్లంపల్లి ఏరియా ఉపాధ్యక్షులు పేరం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. సోమవారం నాడు బెల్లంపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ సింగరేణి సంస్థలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ నియామకాలకు స్థానిక కాంట్రాక్టరు ఒక్కో సెక్యూరిటీ గార్డు నుండి ఒక లక్ష 30 వేల రూపాయల చొప్పున 200 మంది సెక్యూరిటీ గార్డ్ ల నుండి దాదాపు రెండున్నర కోట్ల అక్రమాలకు పాల్పడ్డారని ఈ విషయంపై వెంటనే విచారణ జరిపించి దోషులను శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సెక్యూరిటీ గార్డ్ నియామకాల్లొ సింగరేణి అధికారులు, సెక్యూరిటీ అధికారులు, కంట్రాక్టరు, సూపర్ వైసర్ ప్రధాన నిందితులని. ఈ నలుగురు కుంమక్కై అమాయకులైన, నిరుద్యోగ యువకులను ఉద్యోగాల ఎర వేసి లక్షల రూపాయల అక్రమ వసూళ్లకు పాల్పడ్డారని ఈ అవినీతి లో పాల్గొన్న సింగరేణి అధికారులను సస్పెండ్ చేయాలనీ, కంట్రాక్టరు యొక్క కాంట్రాక్ట్ని రద్దు చేయాలని, సూపర్ వైసర్ వద్ద ఉన్న ఈ డబ్బును అమాయక నిరుద్యోగ యువకులకు ఇప్పించి, ఈ సూపర్వైజర్ అరెస్తు చేసే వరకు ఐ ఎన్ టి యు సి పోరాట కార్యక్రమాలు చేపడుతుందని హెచ్చరించారు.