ఎర్రవల్లి గ్రామంలో చలిదుప్పట్లు పంపిణీ

Published: Thursday December 16, 2021
ఉప సర్పంచ్ నజీమున్నీసా బేగం
వికారాబాద్ బ్యూరో 15 డిసెంబర్ ప్రజాపాలన : వయోవృద్ధులకు చలిదుప్పట్లు పంపిణీ చేశామని ఎర్రవల్లి ఉప సర్పంచ్ నజీమున్నీసా బేగమ్ అన్నారు. బుధవారం వికారాబాద్ మండల పరిధిలోని ఎర్రవల్లి గ్రామంలో 60 మంది వయోవృద్ధులకు చలిదుప్పట్లు (రగ్గులు) పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తాను సంపాదించిన ధనములో కొంత భాగాన్ని బీదసాదలకు పంపిణీ చేయడం పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. సాటి మనుషుల కష్టాలలో నా భాగస్వామ్యం కల్పించిన పెద్దలందరికి కృతజ్ఞురాలిగా ఉంటానని విశ్వాసం వ్యక్తం చేశారు. వయోవృద్ధులకు చలిదుప్పట్లు అందజేయడంలో నాకు సహకరించిన టిఆర్ఎస్ పార్టీ మండల ఉపాధ్యక్షులు గఫార్ కు అభివందనాలు తెలిపారు. కులమతాలకు అతీతంగా అన్ని సామాజిక వర్గాల వయోవృద్ధులకు చలిదుప్పట్లు అందించడం నా జీవితంలో మరువలేని తీపి జ్ఞాపకంగా మిగిలి పోనున్నదని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు విజయ, లక్ష్మి, మాజీ సర్పంచ్ పెంటయ్య, నవాజ్, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.