జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి

Published: Saturday May 21, 2022

నేటి నుండి పల్లె పల్లెలో రైతు రచ్చబండవికారాబాద్ బ్యూరో 20 మే ప్రజాపాలన : రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయదుందుభి మోగిస్తుందని జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామ్మోహన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు జరుగుతుందని పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కమార్ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీతోనే రైతులకు, ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. మొన్న జరిగిన వరంగల్ సభలో ఇచ్చిన హామీలను ప్రజలలోకి తీసుకుపోతామని,12 ఏళ్ళ వయసు నుంచి మరణించే వారి వరకు అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి సారథ్యంలో నిర్వహిస్తామన్నారు.తెలంగాణ అంతట ఈ రచ్చబండ కార్యక్రమాన్ని తీసుకుపోతామని అన్నారు.కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏకకాలంలో రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేస్తామని చెప్పారు. కౌలు రైతులకు ఎకరాకు రూ.15,000 అలాగే భూమిలేని వ్యవసాయ కూలీలకు రూ.12000 అందిస్తామన్నారు.ఎన్ ఆర్ ఈ జి ఎస్ ను వ్యవసాయానికి అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ హయాంలో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన ప్రభుత్వ భూములను క్రయ విక్రయాలు జరుపుకునే అవకాశం కల్పిస్తామని సభలో రాహుల్ గాంధీ తెలిపినట్లు గుర్తుచేశారు.జిల్లాలో మూసివున్న షుగర్ ఫ్యాక్టరీలను మళ్ళీ ప్రారంభిస్తామని తెలిపారు.పెండింగ్ లో ఉన్న ప్రాణహిత చేవెళ్ల,పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులను మళ్ళీ రిఓపెన్ చేసి ప్రాజెక్టులను పూర్తి చేయాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ చంద్రకళ,పట్టణ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు రత్నారెడ్డి, పిఎసిఎస్ మాజీ చైర్మన్ కిషన్ నాయక్, బిల్లపాటి రాజశేఖర్ రెడ్డి, ఎర్రవల్లి జాఫర్, చామల రఘుపతి రెడ్డి చాపల శ్రీనివాస్ ముదిరాజ్ కమల్ రెడ్డి జెడ్పిటిసి మాజీ చైర్మన్ మైపాల్ రెడ్డి అవుటి రాజశేఖర్ తదితర నాయకులు ఉన్నారు.