కేంద్ర పథకాల పై ఫోటో ఎగ్జిబిషన్

Published: Tuesday October 05, 2021
మంచిర్యల బ్యూరో, అక్టోబర్ 04, ప్రజాపాలన : ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ  7 సంవత్సరాల పాలన కాలంలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, సంస్కరణలు, సంక్షేమం పై మంచిర్యాల పట్టణంలోని అల్ఫోర్స్ జూనియర్ కళాశాలలో సోమవారం ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు. ఆర్టికల్ 370 రద్దు, ముస్లిం మహిళల కోసం త్రిపుల్ తలాక్ చట్టం, రామమందిర నిర్మాణం, దేశవ్యాప్త ప్రజలందరికీ ఉచిత కరోనా టీకా, నూతన విద్యా విధానం, దేశ వ్యాప్తంగా ప్రతి జిల్లాకు మెడికల్ కళాశాల, నూతన వ్యవసాయ చట్టాలు, కరోణ కష్టకాలంలో దేశ ప్రజలందరికి ఉచిత రేషన్ అందించడం వంటి తదితర అంశాలపై ప్రజలకు, విద్యార్థుల కు అర్థం అయ్యేలా పోటో లను ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా అద్యక్షులు రఘునాథ్, బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి తులా ఆంజనేయులు, పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు,  బియ్యాల సతీష్ రావు పట్టి వెంకట కృష్ణ, జోగుల శ్రీదేవి, అమిరిషెట్టి రాజు, తోట మల్లికార్జున్ మరియు తదితరులు పాల్గొన్నారు.