ఆరోగ్య మేళ ఆకట్టుకున్న కళాజాత

Published: Friday April 22, 2022
మధిర ఏప్రిల్ 21 ప్రజాపాలన ప్రతినిధి : హెల్త్ మేళాలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తరపున మాస్ మీడియా విభాగం నుండీ ప్రముఖ జానపద కళాకారులు లంకా కొండయ్య బృందం పలు ఆరోగ్య గిరిజన పల్లె సంప్రదాయం గీతాలు నృత్యాలు ప్రదర్శించినారు. ఈ కార్యక్రమంలో పిహెచ్సి దెందుకూరు ఆశాలు రజని లక్ష్మి అంజమ్మ పిహెచ్సి మాటూరు పేట ఆశలు వేమా పద్మావతి, భారతి పాల్గొన్నారు. వీరికి శ్రీ రామభక్త సీతయ్య కళా పరిషత్ సెక్రెటరీ ఆర్ బాబ్ల ప్రశంసా పత్రాలు  కలెక్టర్ చేతుల మీదుగా మరియు లింగాల కమలరాజ్, డియంహెచ్ఓ డా. మాలతీ చేతుల మీదుగా అందించినారు. ఈ కళా జాతను నిర్వహించిన కొండయ్య బృందంను కలెక్టర్ గౌ తం అభినందనలు తెలిపినారు. ఈ కార్యక్రమం లో మాస్ మీడియావిభాగం అదికారి సాంబ శివారెడ్డి, మురళి మరియు డీటీసీఓ డా.వరికూటి సుబ్బారావు ఎన్సిడి ప్రోగ్రాం అధికారి డా.కోటిరత్నం జిల్లా ప్రధాన హాస్పిటల్ సూపరిండెంట్ డా. వెంకటేశ్వరావు ఎయంఓ వెంకటేశ్వర్లు యంసిహెచ్ ప్రోగ్రాం అధికారి డా.సైదులు ఎంపీడీఓ విజయ్ భాస్కర్ రెడ్డి డా.వెంకటేష్ డా.మనోరమ డా.శశిధర్ డా.శ్రీకాంత్ డా.సుధాకర్ అభినందనలు తెలిపి నారు.