అంధత్వ రహిత తెలంగాణ కోసమే కంటి వెలుగు కార్యక్రమం కోరుట్ల ఎం.పీ.పీ తోట నారాయణ

Published: Saturday January 28, 2023

కోరుట్ల, జనవరి 27 (ప్రజాపాలన ప్రతినిధి):
అంధత్వ రహిత తెలంగాణ కోసం కంటి వెలుగు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ప్రపంచంలో గాని,దేశంలో గాని మరెక్కడా లేని విధంగా పేద ప్రజల కంటి సమస్యల నివారణ కోసం కంటి వెలుగు  కార్యక్రమాన్ని ప్రారంభించారనీ కోరుట్ల ఎంపీపీ తోట నారాయణ అన్నారు.ఈ కార్యక్రమం లో భాగంగా ఎమ్మెల్యే  కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  ఆదేశాల మేరకు గుమ్లాపూర్ గ్రామంలో కోరుట్ల ఎంపీపీ తోట నారాయణ, స్థానిక సర్పంచ్ యాదగిరి అమ్మాయి లు  కలిసి కంటి వెలుగ ను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ జంగిలి గంగ నర్సయ్య, వార్డు సభ్యులు గంగ మల్లయ్య, శ్యామల, అధికారులు మెడికల్ ఆఫీసర్ సమీనా తబస్సుమ్, సూపర్ వైజర్ ధనుంజయ్, వైద్య అధికారి షజియా, క్యాంపు సూపర్ వైజర్ జెస్సి కుమారి, డా వర ప్రసాద్, డి.ఈ.ఓ సుప్రియ, ఏ.ఎన్.ఎం తిరుపతమ్మ, ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ టీచర్స్,  పంచాయతీ కార్యదర్శి, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.