గ్రామాల్లో ప్రతి కుటుంబానికి బ్యాంక్ సేవలు : జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

Published: Tuesday February 15, 2022

ఆసిఫాబాద్ జిల్లా ఫిబ్రవరి 14 (ప్రజాపాలన, ప్రతినిధి) :జిల్లాలోని ప్రతి గ్రామంలో కుటుంబానికి బ్యాంకు సేవలు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన వార్షిక అక్షరాస్యత వారోత్సవాలను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ,జి,ఎం, సంజీవ్ కుమార్ సాహూ, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్ కోవ హనుమంత్ రావులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించడం జరుగుతుందని, గ్రామాలలో ప్రతి కుటుంబానికి బ్యాంకు సేవలు అందుబాటులోకి తీసుకురావడం, కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఉచిత నగదు వినియోగం, డిజిటల్, పేమెంట్ ఆన్లైన్ బ్యాంకింగ్, సైబర్ క్రైం నియంత్రణ తదితర అంశాలపై కల్పించడం ముఖ్య ఉద్దేశమని తెలిపారు. తిర్యానీ, దహెగాం, జైనూర్ లలో అక్షరాస్యత కేంద్రాలను చేయడం జరిగిందని, ఈ కేంద్రాల ద్వారా 9 గ్రామాలకు సేవలు అందించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు శాఖల మేనేజర్లు, అక్షరాస్యత కేంద్ర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.