గైడ్ వాల్ నిర్మాణం కొరకు పరిశీలన

Published: Wednesday January 12, 2022

కొడిమ్యాల, జనవరి 11 (ప్రజాపాలన ప్రతినిధి): కొడిమ్యాల మండల కేంద్రం లోని చిలుక వాగు కోతకు గురికాకుండా   చెరువు నుండి వచ్చే నీరు  మరియు డ్రైన్ నుండి వచ్చే నీరు సాఫీగా పోవడానికి కొరకై గైడ్ వాల్ నిర్మించాలని చొప్పదండి శాసనసభ్యులు సుంకె రవిశంకర్ కొడిమ్యాల సింగిల్ విండో చైర్మన్ మేన్నేని రాజనర్సింగారావు కోరగా వెంటనే ఎమ్మెల్యే రవిశంకర్ ఇరిగేషన్ అధికారులను ఆదేశించగా మంగళవారం రోజున  అసిస్టెంట్ ఇంజనీర్ రాజేష్ కన్నా, వర్క్ ఇన్స్పెక్టర్ గంగాధర్ పరిశీలన చేశారు. ఇక్కడ వైస్ ఎంపీపీ పర్లపల్లి ప్రసాద్,కొ ఆప్షన్ సభ్యులు నసీరొద్దీన్, తెరాస మండల అధ్యక్షులు పులి వెంకటేష్ గౌడ్, రైతు బంధు సమితి అధ్యక్షులు అంకం రాజేశం, SCసెల్ మండల అధ్యక్షులు నేరెల్ల మహేష్, మైనారిటీ సెల్ మండల అధ్యక్షులు అబ్దుల్ శుకూర్, తెరాస మండల ఉపాధ్యక్షులు పర్లపల్లి ప్రభుదాస్ తదితరులు ఉన్నారు.