మంత్రి సమక్షంలో జరిగిన ప్రతిష్ఠ కార్మికుల ఒప్పందాన్ని యాజమాన్యం తక్షణమే అమలు చేయాలి.

Published: Thursday December 01, 2022
చౌటుప్పల్ నవంబర్ 30 (ప్రజాపాలన ప్రతినిధి): సిఐటియు చౌటుప్పల్ మండల మహాసభలో జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం డిమాండ్ ప్రతిష్ట కార్మికుల సమస్యలపై కార్మిక శాఖ మంత్రి చామకూరి మల్లారెడ్డి, కార్మిక శాఖ జాయింట్ కమిషన్ సమక్షంలో పరిశ్రమ పరిధిలో ఎండి తో జరిగిన వేతన ఒప్పందం అమలు చేయాలని, బైట ఉంచిన 43 మంది కార్మికులను తక్షణమే విధులకు తీసుకోవాలని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కల్లూరి మల్లేశం డిమాండ్ చేశారు. బుధవారం రోజున చౌటుప్పల్ మండల 10వ మహాసభ స్థానిక సిఐటియు కార్యాలయంలో జరిగింది. ఈ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన కల్లూరి మల్లేశం మాట్లాడుతూ ప్రతిష్ఠ పరిశ్రమలో పని చేస్తున్న కార్మికులు కనీస సమస్యలు పరిష్కారం చేయాలని, వేతన ఒప్పందం కోరుతూ 22 రోజులు సమ్మె చేయడంతో, కార్మిక శాఖ మంత్రి సమక్షంలో వేతన ఒప్పందం కు అంగీకరించి కార్మికుల సమ్మె శిబిరం వద్దకు వచ్చి ప్రకటించిన ప్రతిష్ఠ యండి ఫణిరాజ్ గారు అగ్రిమెంట్ అమలు చేయకుండా ఉప ఎన్నికలు ముగిసిన మరుసటి రోజు నుండి 43 మంది కార్మికులను విధులకు తిసుకోకుండా బైట ఉంచి కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతుందని తక్షణమే కార్మికులను విధులకు తీసుకోవాలని మంత్రి సమక్షంలో జరిగిన వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ మహాసభకు ముందు సినీయర్ సిఐటియు నాయకులు, పట్టణ కన్వీనర్ యండి పాషా,మహాసభకు అద్యక్ష వర్గంగా ఆదిమూలం నందీశ్వర్, గడ్డం వెంకటేశం, జొన్న కంటి దేవయ్యలు వ్యవహారించగా ఈ మహాసభలో ప్రతిష్ఠ యూనియన్ నాయకులు, గ్రామ పంచాయతీ యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు మాండ్ర శ్రీను, ట్రాన్స్ పోర్ట్ యూనియన్ నాయకులు కొంతం శ్రీనివాస్ రెడ్డి, అంగన్వాడీ యూనియన్ రాష్ట్ర కమిటి సభ్యురాలు అరుణ, నాయకురాలు సుజాత, సంధ్యరాణి, భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యదర్శి కలకుంట్ల శివ, నాయకులు, దౌడి యాదగిరి, గంగిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, చీమకండ్ల శ్రీరాములు, కల్పన,మస్కు రామచంద్రం తదితరులు పాల్గొన్నారు.