గ్రేస్ క్యాన్సర్ ఫౌండేషన్ సర్వీస్ విజయవంతం

Published: Thursday April 13, 2023

బోనకల్ ఏప్రిల్ 12 ప్రజా పాలన ప్రతినిధి: మండల పరిధిలోని ఆళ్ళపాడు గ్రామంలో బుధవారం విజయవంతంగా గ్రేస్ కాన్సర్ ఫౌండేషన్ గ్రేస్ సర్వీసు సొసైటీ వారి మెడికల్ క్యాంపు ఆధ్వర్యంలో ఆళ్లపాడు గ్రామ పంచాయతీ కార్యాలయం నందు మెడికల్ క్యాంపు ను సర్పంచ్ మర్రి తిరుపతిరావు ప్రారంభించారు. ఈ క్యాంపు లో ఎక్స్ రేలు రక్తపరీక్షలు స్త్రీలకు సంబంధించిన ఆరువేల రూపాయలు విలువచేసే పరీక్షలు చేసి ఉచితంగా మందులు ఇచ్చారు. ఈ సందర్భంగా సర్పంచ్ మర్రి తిరుపతిరావు మాట్లాడుతూ ఈ కార్యక్రమం నిర్వచించిన గ్రేస్ సర్వీసు ఫౌండేషన్ గ్రేస్ సర్వీసు సొసైటీ వారిని అభినందించారు. ఈ కార్యక్రమం ద్వారా ఎంతో మంది గ్రామ ప్రజలకు మంచి వైద్యం అందించి ఆరోగ్య మీద అవగాహన కల్పించిన డాక్టర్ లను అభినందించారు.ఈకార్యక్రమంలో సర్పంచ్ మర్రి తిరుపతిరావు, మాజీ జడ్పిటిసి బానోత కొండ, ఏరేనేస్ట్ పాల్, సంఘ సభ్యులు నరేష్, సురేష్, డాక్టర్ శ్రీకాంత్ డాక్టర్ సావని, ఏఎన్ఎం, నర్సులు, టెక్నీషియన్స్, గ్రామ పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.