మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి పలు కార్యక్రమాలు హాజరు

Published: Saturday May 21, 2022

మధిర 20 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీపరిధిలో శుక్రవారం నాడు ముందుగా కె.వి.ఆర్ హాస్పిటల్ అధినేత టిఆర్ఎస్ నాయకులు కోటా రాంబాబు  ఇంటి గృహప్రవేశానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొని   నూతన గృహప్రవేశం లో పాల్గొని  దీవించు అనంతరం
మధిర ఆర్.కె.ఫౌండేషన్ దోర్నాల రామకృష్ణ  ఆధ్వర్యంలో ఖాజీపురం గ్రామానికి చెందిన యువదర్శకుడు "ఎ.ఆర్.సమీర్" రచనా,దర్శకత్వంలో  రూపోంచబడిన "సుబ్బారావు గారి అమ్మాయి" షార్ట్ ఫిల్మ్ ట్రైలర్ ను శుక్రవారం టి.ఆర్.ఎస్ రాష్ట్ర నాయకులు  ఖమ్మం మాజీ "ఎంపీ శ్రీ.పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి" చేతుల మీదుగా  "ఎ.ఆర్.సమీర్ టాకీస్" యుట్యూబ్ ఛానల్ లో విడుదల చేశారు. ట్రైలర్ చూసాక శ్రీనివాస్ రెడ్డి డైరెక్టర్ ఎ.ఆర్.సమీర్ ను అభినందించారు అనంతరం డైరెక్టర్ ఎ.ఆర్.సమీర్ మాట్లాడుతూ ఆడపిల్లల గురించి సమాజానికి చక్కటి సందేశానిచ్చే కథాంశంతో పాటుగా మంచి ఆహ్లాదకరమైన వినోదంతో ఈ చిత్రం ఉంటుందని తెలిపారు అదేవిధంగా ఈ షార్ట్ ఫిల్మ్ ఈ నెల 24న విడుదల అవుతుందని అందరు తప్పకుండా చూసి షేర్ చేసి సపోర్ట్ చేయవల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలోచిత్రయూనిట్ మరియు డాక్టర్.కోటా రాంబాబు , యన్నం కోటేశ్వరరావు , శ్రీమతి.ఆర్.కె.జ్యోతి పాల్గొన్నారు.