సమీకృత పోర్టల్ 'కర్మప్రో'ను ప్రారంభించిన మైమనీకర్మ... హైదరాబాద్ (ప్రజాపాలన ప్రతినిధి ):

Published: Thursday August 25, 2022
మొట్టమొదటి పూర్తి సమీకృత డిజిటల్ ప్లాట్ ఫార్మ్ ద్వారా ఫిన్ టెక్ వ్యాపారాన్ని విప్లవాత్మకంగా మార్చనున్నట్లు మైమనీకర్మ సి ఓ ఓ  మరియు హెడ్ ఆఫ్ బిజినెస్ డెవలప్మెంట్, వరుణ్ అగర్వాల్ తెలిపారు.మైమనీకర్మ వేగంగా విస్తరిస్తున్నట్లు,ఒకే సంవత్సరంలో తన భాగస్వామి నెట్వర్క్ ను అసాధారణరీతిలో 748% కు పెంచిందన్నారు.
బంజారాహిల్స్ తాజ్ డెక్కన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడుతూ మైమనీకర్మ గత 7 నెలల్లోనే 86 ప్రాంతాలకు విస్తరించిందని,తన ఆర్థిక సేవలను సరికొత్త సాంకేతికత ఆవిష్కరణలతో జోడించి మరింత విస్తృత పరుస్తున్నట్లు నూతనంగా పూర్తి సమీకృత పోర్టల్ 'కర్మప్రో'ను ప్రారంభించినట్లు ఆయన తెలిపారు.ఈ పోర్టల్ ద్వారా మైమనీకర్మ యొక్క వ్యాపార భాగస్వామ్యాలకు భారీ
ప్రోత్సాహాన్ని అందిస్తాయని మరియు దాని జాతీయ ఉనికిని పెంచేందుకు వీలు కల్పిస్తాయని తెలిపారు.
స్టాన్ ఫోర్డ్ గ్రాడ్యుయేట్లచే స్థాపించబడిన మైమనీకర్మ, స్టాన్ ఫోర్డ్ స్టార్ ఎక్స్ లోని సిలికాన్ వ్యాలీలో అభివృద్ధి చేయబడిందని మరియు
భారతీయ బ్యాంకింగ్ రంగానికి చెందిన డొమైన్ నిపుణుల నేతృత్వంలో, గొప్ప ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి మరియు కస్టమర్లు
తమ రుణాలపై డబ్బును ఆదా చేయడానికి ప్రోత్సహించే సామాజిక లక్ష్యంతో ఇంటెలిజెంట్ ఫైనాన్షియల్ ప్రాడక్ట్లను అందిస్తున్నదన్నారు.
 మైమనీకర్మ కంపెనీ దాదాపు ఒక దశాబ్ద కాలంగా పర్సనల్ ఫైనాన్స్లో డిజిటల్ విప్లవాన్ని
వేగవంతం చేసిందని ప్రారంభమైనప్పటి నుండి ఆరు కీలక ఫైనాన్స్ ప్రాడక్ట్తో 1.9 మిలియన్లకు పైగా కస్టమర్లకు సేవలు అందించిందన్నారు.
 తమ ఈ సేవా ఆవిష్కరణలు మొత్తం కస్టమర్ అనుభవాన్ని మెరుగుపరిచాయని , 56% మంది కస్టమర్లు 3 రోజులలోపుగానే హోమ్ లేదా
ప్రాపర్టీ లోన్ ఆమోదాలను పొందారన్నారు, ఇండస్ట్రీ సగటు 3-4 వారాల లీడ్ టైమ్తో పోలిస్తే 87% మంది 5 రోజులలోపుగానే ఆమోదం పొందినట్లు ఆయన తెలిపారు.