ట్రావెల్స్ రంగం జిల్లాకు రావడం అభినందనీయం: ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్

Published: Monday October 10, 2022

జగిత్యాల, అక్టోబర్ 09 (ప్రజాపాలన ప్రతినిధి): నగరాలకే పరిమితమైన ట్రావెల్స్ రంగం జిల్లా కేంద్రానికి రావడం అభినందనీయం అని ఎమ్మెల్యే  డా. సంజయ్ కుమార్ అన్నారు. జగిత్యాల పట్టణంలో గూడేటి చంద్రదీప్ ఏర్పాటు చేసిన ట్రావెల్స్ బన్నీ షోరూమ్ ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హైదరాబాద్ లాంటి పెద్ద నగరాల్లో విదేశీ ప్రయాణం, ఉపాధి కోసం విదేశాలకు వెళ్ళేందుకు, టూర్స్ కోసం వెళ్ళాలంటే అక్కడికి వెళ్లి టిక్కెట్లు బుక్ చేసుకోవాలంటే ఇబ్బందులు పడేవారని, దాంతో మధ్యవర్తులను సంప్రదిచేవారని అన్నారు.ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ అధ్యక్షుడు మంచాల కృష్ణ, సిరిసిల్ల శ్రీనివాస్, టి. వి. సూర్యం, కళాశ్రీ గూడేటి రాజు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు, ఎన్నం కిషన్ రెడ్డి, గూడేటి చంద్రశేఖర్, గూడేటి రంజిత్ కుమార్, రుద్రాముగి గోపాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు