విద్యార్థుల పోషకాహార లోపం అధిగమించాలి : కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ రమేష్.

Published: Tuesday November 23, 2021

కొడిమ్యాల, నవంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) : విద్యార్థులు పౌష్టికాహారం తీసుకుని పోషకాహార లోపాలను అధిగమించాలని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రమేష్ పిలుపునిచ్చారు. ఆరోగ్య సంరక్షణ కార్యక్రమంలో భాగంగా పాఠశాల సందర్శనలో సోమవారం తిరుమలాపూర్ ఉన్న ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అవగాహన కల్పించారు. చేతులు పరిశుభ్రంగా కడుక్కోవడం వేపుడు పదార్థాలు, జంక్ ఫుడ్ శీతలపానీయాలు నివారించాలని అయోడిన్ కలిగిన ఉప్పును మాత్రమే వాడాలని తెలిపారు. ఆటలు శారీరక అభివృద్ధికి తోడ్పాడుతాయని వివరించారు. ఆడపిల్లలు రక్తహీనత అధిగమించడానికి పల్లీలు, బెల్లం నువ్వులు, కరివేపాకు వంటివి ఎక్కువ గా వాడాలని తెలిపారు ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ఇంచార్జీ ప్రధానోపాధ్యాయులు ఐలయ్య ప్రాథమిక పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు భూలక్ష్మి, దమ్మయ్యపేట్ ఒడ్డెర కాలనీ ప్రధానోపాధ్యాయులు అరేటి వెంకటేశ్వర్లు ఏ.ఎన్ ఎం మమత పాల్గొన్నారు.