సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా కోటపల్లి మండలంలో అన్నదానం

Published: Wednesday February 16, 2022
వికారాబాద్ బ్యూరో 15 ఫిబ్రవరి ప్రజాపాలన : తెలంగాణ ఉద్యమ సారథి సీఎం కేసీఆర్ రాష్ట్రాన్ని సాధించడానికి అహర్నిశలు కృషి చేశారని కోటపల్లి మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్ కొనియాడారు. మంగళవారం కోటపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో సీఎం కేసీఆర్ జన్మదినం పురస్కరించుకొని అన్నదాన కార్యక్రమాన్ని మండల టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సుందరి అనిల్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ జన్మదినాన్ని మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించనున్నామని పేర్కొన్నారు. తొలిరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని స్పష్టం చేశారు రెండవరోజు మూడవ రోజు ఆసక్తికర కార్యక్రమాలు నిర్వహించనున్నామని వివరించారు. మండల పరిధిలోని ప్రతి కార్యకర్త సమాజానికి ఉపయోగపడే విధంగా కార్యక్రమాలు నిర్వహించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ, ఏఎంసి చైర్మన్, టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు, రైతుబంధు అధ్యక్షుడు, ఎంపిటిసిలు, సర్పంచులు, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, తెరాస పార్టీ మండల అనుబంధ కమిటీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.