పోలీసులు ప్రజల మన్ననలు పొందేలా విధులు నిర్వర్తించాలి బెల్లంపల్లి ఏసీపి ఎడ్ల మహేష్,

Published: Tuesday October 11, 2022
బెల్లంపల్లి అక్టోబర్ 10 ప్రజా పాలన ప్రతినిధి:  పోలీసులు ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల మన్ననలు పొందాలని బెల్లంపల్లి ఏసిపి ఎడ్ల మహేష్ అన్నారు.
పోలీస్ స్టేషన్ల  వార్షిక తనిఖీల్లో భాగంగా సోమవారం
  బెల్లంపల్లి సబ్ డివిజన్  తాండూర్ సర్కిల్ పరిధి లోని కన్నెపల్లి పోలీస్ స్టేషన్ను ఆయన తనిఖీ చేశారు,
 పోలీస్ స్టేషన్ సిబ్బంది ఇచ్చిన గౌరవ వందనాన్ని స్వీకరించి, పోలీస్ స్టేషన్ పరిసరాలని పరిశీలించారు. అనంతరం
 ఆయన మాట్లాడుతూ పోలీసులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల మన్ననలు పొందేలా,  క్రమ శిక్షణతో విధులు నిర్వహించాలని,  పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారులతో మర్యాదపూర్వ కంగా మాట్లాడాలని, వారు తీసుకొచ్చిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని  అన్నారు. గ్రామ పోలీస్ అధికారులు తమకు కేటాయించిన గ్రామల్లోకి  వెళ్లి ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలు తెలుసుకుంటూ పై అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. పోలీస్ స్టేషన్లో గాని సర్వీస్ కు సంబంధించిన  ఏలాంటి సమస్యలు ఉన్న నేరుగా తనకు తెలపాలన్నారు.  అనంతరం పోలీస్ స్టేషన్ రికార్డులను  పరిశీలించి. పెండింగ్ లో ఉన్న కేసుల వివరాలు అడిగి తెలుసుకొని, వెంటనే పెండింగ్ కేసులను పూర్తి చేయాలన్నారు. 
పోలీస్ స్టేషన్ పరిధిలో దొంగతనాల నివారణ గురించి నిఘా ఏర్పాటు చేయాలని, నిరంతరం పెట్రోలింగ్ నిర్వహించాలని, ఆకస్మి కంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని సూచించారు. 
దొంగతనాల నిర్మూలన కై గ్రామాలలో, దుకాణాల్లో, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా అవగాహన కల్పించాలని,   సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
అనంతరం అధికారులతో కలిసి పోలీస్ స్టేషన్ ఆవరణలో  మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో తాండూర్ సిఐ కే, జగదీశ్, కన్నేపల్లి ఎస్సై సురేష్ ,భీమిని ఎస్సై వెంకటేష్ , తదితర  పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.
 
 
 
Attachments area