విఆర్ ఏ ల సమస్యలు పరిష్కరించాలి వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్య గౌడ

Published: Tuesday July 26, 2022

ఇబ్రహీంపట్నం జూలై తేదీ 25 ప్రజాపాలన ప్రతినిధి.

మంచాల మండలం కేంద్రంలో వైయస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర నాయకుడు మాదగోని జంగయ్యగౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మొదలు పెట్టిన భూ రికార్డ్ సర్వేకార్యక్రమలో ఎంతో కీలక పాత్ర పోషించిన గ్రామ వి ఆర్ ఏ ల పరిస్థితి చాలా ఘోరంగా మారింది అన్నారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వి ఆర్వో వ్యవస్థను రద్దు చేయటంతో గ్రామాల్లో ఉన్న రెవెన్యూ వి ఆర్ ఏ లు తహశీల్దార్ కార్యాలయంలో ఏమి పని చేయాలో అర్థం కాక ఆందోళనలు చెందుతున్నారు అన్నారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పలు సందర్భాల్లో మాట్లాడుతూ వి ఆర్వో వ్యవస్థ రద్దు కావటంతో ఖాళీగా ఉన్న వి ఆర్వో వి ఆర్ ఏ లకు మరో చోట ఉద్యోగ అవకాశం కలిపిస్తాం వారి కుటుంబాలను అన్నివిధాలుగా ఆదుకుంటాం అని అసెంబ్లీ సాక్షిగా   గొప్పలు చెప్పిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వి ఆర్వో వ్యవస్థను రద్దు చేసి రెండు ఏండ్లు దాటినా ఇప్పట్టి వరకు ఏ ఒక్క వి ఆర్ ఏ కు మరో చోట ఉద్యోగ అవకాశం కల్పించలేదు అన్నారు గ్రామ వి ఆర్వో ల పరిస్థితి కూడా దయనీయ పరిస్థితుల్లో ఉన్నారు వి ఆర్వో లకు మరో ఉద్యోగ అవకాశం కల్పించి ఆదుకోవాలి అన్నారు గ్రామ లోరైతుల భూ సమస్యలు పరిష్కరించటంలో కీలక పాత్ర పోషించిన  వి ఆర్ ఏ లు తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఆర్డీఓ కార్యాలయ ముందు దీక్షలు చేస్తూ పోరాటం చేస్తున్న ప్రభుత్వనికి చీమ కుట్టి నట్టు కూడా లేదు అన్నారు వెంటనే ప్రభుత్వం స్పందించి వి అర్ ఏ ల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టాలి వారికి ఉద్యోగ భద్రత కల్పించాలి వి ఆర్ ఏ లు అన్ని విధాలుగా ఆదుకోవాలి అలాగే వి ఆర్వో ల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని డిమాండ్ చేస్తున్నాంలేని పక్షంలో వి ఆర్ ఏ లతో కలిసి ఉద్యమం వేగవంతం చేస్తాం అని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వని హెచ్చరిస్తున్నాం ఈ కార్యక్రమంలో.మంచాల మండలం అధ్యక్షుడు
నేనవత్ శ్రీనివాస్ నాయక్.యాచారం మండలం అధ్యక్షుడు పంది జయరాజ్.బూడిద మహేందర్
ఉదవత్ బాలాజీ నాయక్, ఉదవత్ కిసాన్
తదితరులు పాల్గొన్నారు.