ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఇంటింటి సర్వే

Published: Saturday May 08, 2021
బాలపూర్, మే7, ప్రజాపాలన ప్రతినిధి : కార్పోరేషన్ డిప్యూటీ మేయర్, పలు డివిజన్ల కార్పొరేటర్లు ఆ డివిజన్ లోనీ ప్రజలందరూ పలు జాగ్రత్తల అవగాహన తో పాటు జ్వరంతో కూడిన వారికి ఇబ్బందులు ఉంటే మందులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. బాలాపూర్ మండలం మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో కార్పొరేటర్లు కలిసి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశాలనుసారంగా శుక్రవారం నాడు హెల్త్ డిపార్ట్మెంట్ సిబ్బందితోపాటు ప్రజా ప్రతినిధులు సర్వే చేసి, ఇంటింటికి మందులు ఇవ్వడం జరిగింది. అనంతరం కార్పొరేషన్ ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ.... కరోనా మహమ్మారి సెకండ్ వే నైపద్యంలో ప్రజలందరూ సురక్షితంతో ఉండాలని కోరుకుంటూ వైద్య ఆరోగ్య శాఖ అప్రమత్తమైంది అని చెప్పారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లోని కొన్ని బృందాలుగా ఏర్పడి ఇంటింటి సర్వే  చేపట్టారు. ఎవరికైనా జ్వరంతో బాధపడుతున్న వారికి, జలుబు దగ్గు, వగైరా ఏమన్నా ఉంటే జాగ్రత్తలు సూచనలు  చెప్పమని ఆరోగ్యశాఖ సిబ్బందికి ఆశా వర్కర్లకు, ఏ ఎన్ ఎం లు, అంగన్వాడి టీచర్ల తో పాటు ఆ డివిజన్ కార్పొరేటర్ ప్రజల ఆరోగ్య జాగ్రత్తలు వివరించారు. ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పోరేషన్ మేయర్ దుర్గ దీప్ లాల్ చౌహన్, డిప్యూటీ మేయర్ తీగల విక్రమ్ రెడ్డి, కార్పొరేషన్ కమిషనర్ సుమన్ రావు, 12 వ డివిజన్ కార్పొరేటర్ ఇంద్రావత్ రవి నాయక్, సిద్ధాల చిన్న బీరప్ప, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఏ ఎన్ ఎం లు మంజుల, మమత, పద్మ, ఆశా వర్కర్లు, సుజాత, శ్రీలత, ప్రేమ కుమారి,  సుమలత,  అంగన్వాడి టీచర్ల సుకన్య, తదితరులు పాల్గొన్నారు.