ప్రభుత్వానికి- ప్రజలకు మధ్య వారధి జర్నలిస్టులు వారి సేవలు వెలకట్టలేనివి* * విద్యాశాఖ మంత్రి

Published: Saturday December 31, 2022

ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లోని కొంగరకలాన్ లక్ష్మీదేవమ్మ ఫంక్షన్హాల్ లో తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం జిల్లా మహాసభలు శుక్రవారం జిల్లా అధ్యక్షుడు ఉప్పరి శేఖర్ సాగర్ అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా విద్యా శాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి, నియోజకవర్గ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కాల యాదయ్య, తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ నిరంతరం శ్రమిస్తున్న జర్నలిస్టుల సేవలు వెలకట్టలేనివని విద్యాశాఖ మంత్రి పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ప్రజాప్రతినిధులకు జర్నలిస్టులకు విడదీయలేని అనుబంధమని మంత్రి అన్నారు. జిల్లా మహాసభలకు విచ్చేసినటువంటి జర్నలిస్టు సోదరుల సమక్షంలో టి యు డబ్ల్యూ జే పతాకావిష్కరణ గావించారు. అనంతరం సంఘ పెద్దలు మంత్రి గారికి మూడు విన్నపాలు చేశారు మొదటిది జర్నలిస్టులకు సొంత ఇంటి కల నెరవేర్చాలని, స్థలం ఉన్న వారికి ఇల్లు కట్టుకునెందుకు సహకారం అందించసాలని, స్థలం లేని వారికి స్థలం, వీలుంటే డబుల్ బెడ్ రూమ్ మంజూరు చేయాలని, అదేవిధంగా ప్రతి జర్నలిస్టు కుటుంబాలకు  హెల్త్ కార్డులు,  మండలానికి ఒక ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేయాలని వారు కోరారు. స్పందించిన మంత్రి తప్పకుండా మీ కోరికలు నెరవేరుస్తామని స్థానిక ఎమ్మెల్యే తో మాట్లాడి హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం సంఘ పెద్దలు నియోజకవర్గ జర్నలిస్టులు ముఖ్య అతిథులకు శాలువాలతో సన్మానించి జ్ఞాపికలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ  నాలుగో మెట్టు లాంటి పత్రికారంగం ప్రజలకు వాస్తవాలను అందిస్తూ, నిస్వార్ధంగా పనిచేయాలని, జర్నలిస్టుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లప్పుడు కృషి చేస్తుందని ఆయన అన్నారు. నియోజకవర్గ జనశ్యులందరికీ తప్పనిసరిగా సహకరిస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. ప్రెస్డ్ కాడమీ చైర్మన్ అల్లం నారాయణ మాట్లాడుతూ జర్నలిస్టులకు టియుడబ్ల్యూజే సంఘం ఎల్లవేళలా తోడుగా ఉంటుందని, కరోనా సమయంలో మరణించిన జర్నలిస్ట్ కుటుంబాలకు, కరోనా బారినపడిన జర్నలిస్టులకు పూర్తి సహాయ సహకారాలు అందించామని ఈ సంవత్సరం చాలావరకు అక్రిడేషన్ కార్డులు అందించామని ఆయన తెలియజేశారు. ముందు ముందు సంఘంలో పనిచేసే ప్రతి జర్నలిస్టు సంఘం పెద్దలు అందుబాటులో ఉంటారని వారికి మనోధైర్యాన్ని నింపారు. జిల్లా అధ్యక్షుడు శేఖర్ సాగర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారుతి సాగర్ తదితరులు జర్నలిస్టుల సమస్యల పట్ల తగిన సలహాలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో చేవెళ్లక్ ఎమ్మెల్యే కాల యాదయ్య ,  ఆదిభట్ల మున్సిపల్ చైర్ పర్సన్ కొత్త ఆర్థిక ప్రవీణ్ గౌడ్ , తెలంగాణ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ ఉప్పల శ్రీనివాస్ గుప్తా, జిల్లా ప్రధాన కార్యదర్శి గాదం రమేష్, ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షుడు సురమోని సత్యనారాయణ, చెరుకూరి మహేందర్, చెరుకూరి రాజు, చెరుకూరు మహేందర్, పి. వెంకటేష్, పి. క్రాంతి, పి సుదర్శన్, అశోక్,  సీనియర్ జర్నలిస్ట్ తరణి మఠం చండీశ్వర్,  చీమల రామకృష్ణ యాదవ్, చెరుకూరి మల్లేష్, పసునూరి వెంకటేష్, చౌదర్పల్లి రాజు ఉమ్మడి జిల్లాలోని జిల్లా నియోజకవర్గ పరిధిలో వివిధ బాధ్యతలు కలిగిన జర్నలిస్టు సోదరులందరు పాల్గొన్నారు.