ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేవరకు పోరాటం చేస్తా: సీఎల్పీ నేత భట్టి విక్రమార్క

Published: Tuesday April 12, 2022
బోనకల్, ఏప్రిల్ 11 ప్రజాపాలన ప్రతినిధి: మధిర శాసన సభ్యులు, ప్రతిపక్ష నాయకుడు భట్టి విక్రమార్క చేస్తున్న పాదయాత్ర  సోమవారం బోనకల్  గ్రామంలోకి ప్రవేశించడంతో మండల ప్రజలు తమ అభిమాన నేత భట్టి విక్రమార్కకు బంతిపూల వర్షంతో, డప్పు, కొలాటం ఆడుతూ ఘనంగ స్వాగతం పలికారు. ఈ పాదయాత్రకు సీపీఎం, సీపీఐ నాయకులు పాల్గొని సంఘీభవాన్ని తెలిపారు. బోనకల్, రావినూతల, గార్లపాడు, రామాపురం మీదుగా కొనసాగిన పాదయాత్రకు ప్రజలు దారి పొడవున ప్రజలు ఆదరిస్తూ అభిమాన నేతకు బ్రహ్మరథం పట్టారు. భట్టి విక్రమార్క ఆయా గ్రామాల్లో మాట్లాడుతూ పాదయాత్రకు అపూర్వ స్వాగతం పలికిన ప్రజలందరికి ధన్యవాదాలు తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులు పండించిన పంటను కొనాల్సింది పోయి వారే ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని, కేంద్రంలో ఉన్న బిజెపి సర్కారు తెలంగాణ గల్లీలో ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. 75 ఏళ్ల భారతదేశ స్వాతంత్ర చరిత్రలో అధికారంలో ఉన్న పాలకులు ధర్నాలు చేయడం ఇంతవరకు చూడలేదని వారిపై మండి పడ్డారు. వరి ధాన్యం కొనుగోలు చేయాల్సిన బాధ్యతను విస్మరించి కొనుగోలు చేయడం తమతో కాదని చేతులెత్తేసిన టిఆర్ఎస్, బిజెపి ప్రభుత్వాలు పాలకులుగా ఉండటం దౌర్భాగ్యం అని వారిపై విరుచుకు పడ్డారు. రాష్ట్రం, దేశంలో పెరుగుతున్న ధరలతో సామాన్యులు సైతం బ్రతికే పరిస్థితి లేదని, ఒక వైపు రాష్ట్ర రైతాంగం గులాభి పురుగుతో తీవ్ర సంక్షోభంలో ఉంటే ఆదుకోవాల్సిన ప్రభుత్వం ఏమి పట్టనట్లు వ్యవహరిస్తోందని, అలాగే దేశంలో పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరలను పెంచుకుంటూపోతు సంస్థలను ప్రైవేట్ పరం చేస్తు ఊలుకుపలుకు లేక మొద్దు నిద్రలో ఉన్నదని, ప్రజా సమస్యలనూ గాలికొదిలేసిన గులాబీ రంగు పురుగు, తామర పురుగులను రాష్ట్ర దేశ సరిహద్దుల వరకు తరిమివేయాలని తెరాస, బిజేపీలపై నిప్పులు చెరిగారు. ప్రజలు సభలో నినాదాలు చేస్తూ హోరెత్తించారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పాదయాత్ర చేస్తుంటే ప్రజలు ఇల్లులేని వారు, వృద్ధాప్య, వికలాంగు, వితంతు పెన్షన్లు రానీ వారు వినతి పత్రం రూపంలో ప్రజా నాయకుడు భట్టికి అందజేశారు.  పరోక్షంగా టీఆర్ఎస్, బిజెపి నాయకులకు చురకలు అంటించారు. ఈ పాదయాత్ర రాజకీయం చేయడానికి కాదని, సామాన్య ప్రజల సమస్యలనూ తెలుసుకుంటూ వాటి పరిష్కారం కోసం చేస్తున్న యాత్రే ఈ పీపుల్స్ మార్చ్ అన్నారు. ఒక వైపు రాష్ట్రంలో మధ్యం, పెట్రోల్, డీజిల్, మందుకట్టలు నిత్యావసర, విద్యుత్ ధరలు పది రెట్లు పెంచి వారి వద్దనుంచి వేల రూపాయలను స్వాహా చేస్తూ, మరో వైపు పథకాల అమలు చేస్తున్నమంటు తప్పుడు లెక్కలతో ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడం విడ్డూరంగా ఉందని కేసిఆర్ పై విమర్శనాస్త్రాలు సంధించారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ప్రభుత్వంతో కొట్లాడి అమలు చేపిస్తానని హామీ ఇచ్చారు. ఈ యాత్ర కేవలం మధిర నియోజకవర్గం వరకే కాదని, రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ తెరాస ప్రభుత్వ నిరంకుశత్వానికి చరమ గీతం పాడుతానని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు, మరీదు శ్రీను, భానోత్ శ్రీనివాస రావు, భానోత్ వెంకటేశ్వర్లు, భూక్యా బాలకృష్ణ, గుగూలోతు చందు, బానోతు గోపి, బోడా యోగి, డిసిసి కార్యదర్శి పైడిపల్లి కిషోర్ కుమార్, జెడ్పీటీసీ మోదుగు సుధీర్ బాబు, మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కర్నాటి రామ కోటేశ్వరరావు,మధిర నియోజకర్గ నాయకులు ఉమ్మీనేని రమేష్, యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ యామాల రవికుమార్, చోప్పకట్లపాలెం సర్పంచ్  సుబ్బారావు, చిరునోముల సర్పంచ్ ములకారపు రవి, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు భూక్యా భద్రు నాయక్, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ డి వేలాద్రీ, కాంగ్రెస్ నాయకులు పిల్లలమర్రి నాగేశ్వరరావు, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు, శాఖా అధ్యక్షులు యూత్ నాయకులు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.