నిందితులను కఠినంగా శిక్షించాలి

Published: Monday May 31, 2021

గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాథోడ్ శ్రీనివాస్ నాయక్
పరిగి, మే 30, ప్రజాపాలన ప్రతినిధి :  మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లా మండలం ధర్మారం తండా లో జరిగిన విషాద ఘటన ఒక గిరిజన మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసి తర్వాత హత్య చేసి చంపడం అనేది చాలా దుర్మార్గమైన విషయం దీని వెనుక ఉన్న నిందితులను వెంటనే ఉరిశిక్ష విధించాలని ప్రభుత్వాన్ని గిరిజన విద్యార్థి సంఘం తరఫున కోరడం జరిగింది. నాటి నుంచి నేటి వరకు స్త్రీలకే సౌకర్యం లేదు. ఎక్కడ చూసినా ఎక్కడ విన్నా స్త్రీలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. దీన్ని ప్రభుత్వం ఎందుకు పకడ్బందీగా స్త్రీలకు రక్షణ లేకుండా వ్యవహరిస్తుంది. కులం మతం అనే అహంకారంతో  గిరిజనులకు ఒక న్యాయం వేరే కులాల వాళ్ళకి ఒక న్యాయం అగ్రకులానికి చెందిన అమ్మాయి అయితే ఈపాటికి ఉరిశిక్ష వేసిన ప్రభుత్వం ఇచ్చిన తీరును పక్కదారి పట్టించి పోలీసులు ఎన్కౌంటర్ చేసేవాళ్ళని గిరిజన విద్యార్థి సంఘం వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రాథోడ్ శ్రీనివాస్ నాయక్ వాపోయారు. ఇప్పుడో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలంలో జరిగిన ఘటనపై శ్రీనివాస్ స్పందిస్తూ బాలికపై అత్యాచారం చేసి చంపిన నిందితులను కఠినంగా శిక్షించి వెంటనే ఉరిశిక్ష విధించాలని వారు  డిమాండ్ చేశారు....