వరి కొయ్యలకు నిప్పు పెట్టిన రైతు.... ఊరి వైపు దూసుకొచ్చిన మంటలు || తృటిలో తప్పిన పెను ప్రమాదం.

Published: Wednesday June 08, 2022
పాలేరు జూన్ 8 ప్రజాపాలన ప్రతినిధి
వరి కొయ్యలను తగలబెట్టేందుకు ఓ రైతు నిప్పు పెట్టాడు...ఈచిన
వడగాలులకు మంటలు అదుపు తప్పి... ఉదృతంగా ఊరి వైపు దూసుకొచ్చాయి. అప్రమతమైన గ్రామస్తులు మంటలను అదుపులోకి తీసుకరావటంతో పెనుప్రమాదం తప్పింది....వివరాలు ఇలా ఉన్నాయి. నేలకొండపల్లి మండలం లోని ఆజయ్ండా పంచాయతీలో పాత గ్రామమైన బూసిగుట్ట తండా కు అనుకుని ఉన్న రైతు మంగళవారం వరి కొయ్యలను తగలబెట్టేదుకు నిప్పు పెట్టాడు. ఆ మంటలు వడగాలులకు పక్క పొలాలను అంటుకుని, ఊరిని చుట్టుముట్టాయి. దట్టమైన పొగలు ఊళ్లోకి రావటంతో గమనించిన ప్రజలు అప్రమతమయ్యారు. సర్పంచ్ పార్వతి తెలియజేయగా వెంటనే స్పందించి పంచాయతీ ట్యాంకర్ ద్వారా నీటిని తెప్పించి మంటలు వ్యాపించకుండా పొలాలను నీటితో తడిపారు. ఒక పక్క వడగాలులు, మంటలు ఉదృతంగా ఉండటంతో ప్రజలు. ఆందోళన చెందారు. ఊరి మీద పడితే గ్రామంలో ఊపిరాడక పెద్ద నష్టం జరిగే
అవకాశం ఉందని ప్రజలు భయపడ్డారు. మొత్తం మీద మంటలను అదుపు లోకి
రావటంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. సర్పంచ్ సమయ స్పూర్తి తో
గ్రామానికి నష్టం జరగకుండా చేపట్టిన చర్యలను గ్రామస్తులు అభినందించారు.