ఆసరాతో ఆపన్న హస్తం

Published: Saturday August 27, 2022
వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్
వికారాబాద్ బ్యూరో 26 ఆగస్టు ప్రజా పాలన : వృద్ధులకు ఒంటరి మహిళలకు వితంతువులకు వికలాంగులకు ఆసరా పెన్షన్లు సిఎం కేసీఆర్ మంజూరు చేసి ఆర్థికంగా చేదోడుగా నిరుస్తున్నారని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. శుక్రవారం మర్పల్లి మండల పరిధిలోని పట్లూరు గ్రామంలో గ్రామ సర్పంచ్ దేవరదేశి ఇందిర అశోక్ అధ్యక్షతన మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు నాదిరీగ శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ 182 మందికి ఆసరా పెన్షన్లు మంజూరైన ధృపత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా పురస్కరించుకొని ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్లూరు గ్రామంలో 182 మొగిలి గుండ్ల గ్రామంలో 29 మందికి మొత్తం 211 మందికి ఆసరా పెన్షన్ల ధూపత్రాలను అందజేశామని పేర్కొన్నారు. జీవితంలో ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని కుటుంబ భారాన్ని భుజస్కంధాలపై మోసిన వయోవృద్ధులకు సీఎం కేసీఆర్ కొండంత అండగా నిలుస్తున్నారని గుర్తు చేశారు. అలసిన గుండెలకు వృద్ధాప్యంలో  వెన్నుదన్నుగా నిలుస్తున్నారని స్పష్టం చేశారు. దేశంలో ఎక్కడ లేనివిధంగా *గౌరవప్రదమైన పెన్షన్* అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. అనంతరం పట్లూరు జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో  *75వ స్వతంత్ర భారత* వజ్రోత్సవాల సందర్భంగా ముగ్గుల పోటీలో గెలుపొందిన బాలబాలికలకు  బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోయిజ్ ఎంపిటిసి స్వప్న సురేష్ జడ్పిటిసి మధుకర్ వైస్ ఎంపిపి మోహన్ రెడ్డి రైతు సమితి మండల అధ్యక్షుడు నాయబ్ గౌడ్ ఎంపిటీసీల ఫోరం అధ్యక్షుడు మల్లేశం మాజీ వైస్ ఎంపిపి అంజయ్య గౌడ్ వివిధ గ్రామాల సర్పంచులు వివిధ గ్రామాల ఎంపిటీసీలు సొసైటీ డైరెక్టర్లు మార్కెట్ కమిటీ డైరెక్టర్లు  ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.