రెవెన్యూ అధికారుల సమస్యల పరిష్కార లక్ష్యమే ట్రెసా

Published: Monday October 25, 2021
రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్
వికారాబాద్ బ్యూరో 24 అక్టోబర్ ప్రజాపాలన : రెవెన్యూ అధికారుల సమస్యలను పరిష్కరించడమే లక్ష్యంగా ట్రెసా (తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్ సర్వీసెస్ అసోసియేషన్ ) ఏర్పడిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ కుమార్ అన్నారు. ఆదివారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఎంపిడిఓ కార్యాలయంలోని రవీంద్ర మండపంలో ఎన్నికల అధికారిగా బాణాల రాంరెడ్డి, అతిథులుగా వి.రామకృష్ణారెడ్డి, పి.సుధాకర్, పి.శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో వికారాబాద్ జిల్లా ట్రెసా నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి అధికారి విధులను సక్రమంగా నిర్వహిస్తూ ఆదర్శంగా నిలవాలని హితవు పలికారు. ప్రభుత్వ విధి విధానాలలో నిర్లక్ష్యం వహించరాదని సూచించారు. ప్రతి అధికారి ప్రజల సంక్షేమం దృష్ట్యా విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు. ప్రభుత్వానికిి ప్రజలకు మధ్య వారధిలా ఉండాలని స్పష్టం చేేశారు. వికారాబాద్ జిల్లా ట్రెసా అధ్యక్షుడు బి. కృష్ణ మాట్లాడుతూ జిల్లా అధ్యక్ష పదవి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా రెవెన్యూూూూ అధికారుల సమస్యల పరిష్కారానికి శక్తివంచన లేకుండా అహర్నిశలు కృషి చేస్తానని భరోసాా కల్పించారు. అధికారులకు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడతామని వివరించారు. వికారాబాద్ జిల్లా ట్రెసా అధ్యక్షునిగా బి కృష్ణయ్య, అసోసియేట్ అధ్యక్షులుగా ఆనందం, బాల్ రాజ్, వైస్ ప్రెసిడెంట్ గా తులసి రాం, నర్సింహారెడ్డి, వహీద్ ఖాతుమ్ ఖాజా పాషాలను నియమించారు. జనరల్ సెక్రటరీ విజయేందర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ శ్రీనివాస్ రెడ్డి, విజయ్, జాయింట్ సెక్రటరీ రవీందర్, అశోక్, భారతమ్మ, స్పోర్ట్స్ సెక్రటరీ సురేష్, కోశాధికారి మహేష్ గౌడ్, ఈసీ మెంబర్స్ శ్రీనివాస్ రావు, మానిక్ రావు, మోహన్, నరేష్ కుమార్, రాములు, భాగ్యలక్ష్మి, శషికళ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ....రెవెన్యూ సమస్యలు పరిష్కరించేందుకు తప్పక కృషి చేస్తామన్నారు. తమ హక్కులు కాలరాస్తే ఊరుకునేది లేదని తెలిపారు. రెవెన్యూ ఉద్యోగులకు అనేక సమస్యలతో సతమతం అవుతున్నారని అన్నారు. విఆర్వోలను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఇష్టం వచ్చిన విధులకు ప్రభుత్వం రెవెన్యూ ఉద్యోగులను వాడుకోవడం జరుగుతుందన్నారు. ఉద్యోగులను ఒత్తిడి నుంచి తగ్గించాలని, ఉద్యోగుల శ్రమ దోపిడీ జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ ఉద్యోగులు ఉన్నారు.