మధిర పట్టణ పెయింటర్స్ కు ఐడి కార్డులు పంపిణీ

Published: Monday January 24, 2022
మధిర జనవరి 23 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపల్ పరిధిలో ఆదివారం ఉదయం శ్రీరస్తు ఫంక్షన్ హాల్ లో జరిగిన పెయింటర్స్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీలర్స్ వచ్చే పెయింటర్స్కి ఐడి కార్డులు పంపిణీ చేశారు పెయింటింగ్ వర్కర్లు గత ఎన్నో సంవత్సరాల నుండి వారి జీవనాధారం పెయింటింగ్ పనితో ముడిపడి జీవనం గడుపుతున్నారు గత కొన్ని నెలలుగా ఒక యూనియన్ ఏర్పడి ఒక కమిటీ వేసుకొని పల్లె పోగు బుజ్జి అధ్యక్షతన ఈ రోజున శ్రీరస్తు కళ్యాణమండపంలో సమావేశమైనారు మధిర పట్టణ పెయింటింగ్ యూనియన్ అను పేరుతో ఈ రోజున ఈ యూనియన్లో సభ్యత్వం తీసుకున్న వారందరికీ ఐడి కార్డులు జారీ చేసినారు అలాగే ఎవరైనా పెయింటర్ యూనియన్ లోకి చేరాలి అంటే సభ్యత్వం తీసుకొని నమోదు చేసుకోగలరు మన కార్మికులకు ఎన్నో లాభాలు ఉంటాయని అలాగే ఒక ఐడి కార్డు వలన గుర్తింపు లభిస్తుంది కాబట్టి మీరు ఎక్కడైనా పని చేసుకోవడానికి వీలుగా ఉంటుంది ఈ ఐడి కార్డు వలన మనకి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టిన పెట్టిన పదకాలకు కూడా ఈ  కార్డు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మధిర పట్టణంలో ఉన్న పెయింట్ షాప్ డీలర్ల ను అందరునీ పిలిచి పెయింటర్ లందరూ ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో దాదాపుగా 200 మంది ఈ సమావేశానికి హాజరు అయ్యి యూనియన్ కి సంబంధించిన కొన్ని కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు