మేరు కులస్తులను ఆదుకోవాలని ఎమ్మెల్యేకు వినతి

Published: Wednesday September 01, 2021

మేడిపల్లి, ఆగస్టు 31 (ప్రజాపాలన ప్రతినిధి) : కరోనా కష్టకాలంలో మేరు (దర్జీ) కులస్తులను ఆదుకొని మేరు ఫెడరేషన్ ఏర్పాటు, మేరు బంధు పథకం అమలు చేయుటకై అసెంబ్లీలో ప్రస్తావించాలని కోరుతూ తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షులు దుర్గారావు ఆధ్వర్యంలో ఉప్పల్ నియోజకవర్గం మేరు కుల సంక్షేమ సంఘం ప్రతినిధులు ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉప్పల్ నియోజకవర్గం మేరు కుల సంక్షేమ సంఘం ముఖ్య సలహాదారులు సింగ్ విష్ణు మేరు మాట్లాడుతూ మహమ్మారి కరోనా కష్టకాలంలో వివాహాలు, పాఠశాలలు లేకపోవడంతో మేరు (దర్జీ) కులస్తుల జీవనం ప్రశ్నార్థకంగా మారిందని తెలిపారు. మేరు కులస్తులను ఆదుకొని, మేరు ఫెడరేషన్ ఏర్పాటు, మేరు బంధు పథకం అమలు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ అసెంబ్లీ మేరు కుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రుద్రంగి కరుణాకర్ మేరు, ప్రధాన కార్యదర్శి కర్నే మల్లేష్ మేరు, ట్రెజర్ రాాపర్తి దేవేందర్ మేరు పాల్గొన్నారు.