డాక్టర్ ఉదయ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా అనాధ ఆశ్రమంలో అన్నదానం.

Published: Wednesday October 27, 2021
మధిర అక్టోబర్ 26 ప్రజాపాలన ప్రతినిధి : రోజు మధిరలో మానవ సేవే మాధవ సేవ అంటూ అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న మధిర రెస్క్యూ టీం. సారథ్యంలో నిర్వహిస్తున్న. ఆర్కే ఫౌండేషన్ అనాధ ఆశ్రమంలో.. కీర్తిశేషులు. డాక్టర్ కోట ఉదయ్ తేజ్.. పుట్టినరోజు సందర్భంగా.. పేదలకు మతిస్థిమితం లేని వారికి భోజనం పండ్లు అందించడం జరిగింది.. ఉదయ్ తేజ్ కు పిల్లలంటే ఎక్కువ ప్రేమ.. అనేకమంది అవసరాలు గుర్తించి తీర్చిన ఉదయ్ తేజ్ మనమధ్య లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అంటూ తల్లిదండ్రులు స్నేహితులు.. తన జ్ఞాపకాలను గుర్తు తెచ్చుకుంటూ కన్నీటిపర్యంతమయ్యారు.. అనాధ ఆశ్రమంలో స్థితిగతులు తెలుసుకొని అవసరమైన రెండు ఫ్యాన్ లను తెప్పించి ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో మధిర రెస్క్యూ టీం.దోర్నాల రామకృష్ణ నిస్సి జ్యోతి ఆర్ కె.రమ రామారావు రాము పాల్గొన్నారు.