doc202152811.pdf జర్నలిస్టులకోసం కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన జర్నలిస్ట్ వెల్ఫేర్ స్కీం గైడ్ లైన్స

Published: Friday July 29, 2022
హైదరాబాద్‌లోని కవాడిగూడ కల్పన థియేటర్ ఎదురుగా దీనికి సంబంధించిన ఆఫీసు ఉంది. 5 లక్షల రూపాయల వరకూ జర్నలిస్టులకు కేంద్రం సాయం చేసేలా పథకం తయారు చేశారు. అక్రెడిటేషన్ లేని వారికి కూడా ఈ పథకం కింద సాయం అందిస్తారు. ఐదు సంవత్సరాలు వరుసగా జర్నలిజం ఉపాథిగా పని చేసి ఉంటే చాలు.  అనుకోని దుర్ఘటనలో మరణించినా, ప్రమాదంలో గాయపడి, తిరిగి పని చేసే పరిస్థితిలో లేకపోయినా రూ. 5 లక్షలు సాయంగా అందుకోవచ్చు.                                                                                        క్యాన్సర్, కిడ్నీ సంబంధిత వ్యాధులు, గుండె సంబంధిత వ్యాధులు, సర్జరీలు, మెదడు సంబంధిత వ్యాధులు, పక్షవాతం తదితర వ్యాధుల చికిత్స కోసం రూ. 3లక్షల రూపాయలు సాయంగా కేంద్రం అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం, ఆయా ప్రభుత్వ విభాగాల ఆరోగ్య పథకం, ఇన్స్యూరెన్స్ పథకాలకి లబ్ధిదారులు కాని వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది.  65 సంవత్సరాల లోపు జర్నలిస్టులకి ఈ పథకాన్ని ఉద్దేశించారు.                                                               ప్రమాదంలో తీవ్రం గాయపడి ఆసుపత్రుల్లో చికిత్స పొందిన జర్నలిస్టులు రూ. 2 లక్షలు సాయం అందుకోవచ్చు.                                                                                                                     అయితే చికిత్స పూర్తైన తరువాత దానికి సంబంధించిన ఒరిజినల్ పత్రాలు, దరఖాస్తు సమర్పిస్తేనే  ఈ సాయం అందుతుంది.