ప్రైవేట్ ,కార్పోరేట్ పాఠశాలల ఆగడాలను అరికట్టాలి

Published: Thursday July 07, 2022
మంచిర్యాల టౌన్, జూలై 06, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లాలోని పలు ప్రైవేట్ ,కార్పోరేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలు పట్టించడం లేదని  ఎన్ ఏస్ ఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జుమ్మిడి గోపాల్ తెలంగాణ విద్యార్థి సమాఖ్య జిల్లా అధ్యక్షులు రేగుంట క్రాంతి లు అన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని ప్రైవేట్,కార్పోరేట్ పాఠశాలలు తమకు ఇష్టం వచ్చినట్లుగా బుక్స్,పెన్స్, టై, షూస్,పెన్సిల్స్,డ్రెస్ లు అమ్ముతు,విద్యాలయాలను వ్యాపార సంస్థలు గా మారుస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడ కూడా ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యహక్కు చట్టాన్ని అమలు చేయడం లేదన్నారు.   కనీసం ఎలాంటి నియమ నిబంధనలు పట్టించని కార్పోరేట్ ,ప్రైవేటు పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో  నేతకాని స్టూడెంట్ ఫెడరేషన్ చెన్నూర్ ఇంచార్జి కుమ్మరి సంతోష్,రాజేష్,నవీన్, తదితరులు పాల్గొన్నారు.