నాయకుల ఎదుగుదల ఓర్వలేకనే అసత్య ఆరోపణలు. మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు మద్దెల గోపి, నియోజక

Published: Wednesday October 19, 2022
బెల్లంపల్లి, అక్టోబర్ 18 , ప్రజా పాలన ప్రతినిధి: 
 
మాల మహానాడు జిల్లా అధ్యక్షుడు అయిన కుంభాల రాజేష్, రాష్ట్ర యువజన నాయకులు ఆసాడి మధుల ఎదుగుదల ఓర్వలేకనే కార్యదర్శి కుసుమ మధు అసత్య ఆరోపణలు చేస్తున్నారని, మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు మద్దెల గోపి, బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు దాసరి ప్రతాప్ లు అన్నారు. మంగళవారం నాడు బెల్లంపల్లి బాబు క్యాంప్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు,
తెలంగాణ మాల మహానాడు నాయకులు కుంభాల రాజేష్, ఆసాది మధుల రాజకీయ ఎదుగుదలను ఓర్వలేకనే,  రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధుసూదన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారని, మధుసూదన్ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ మాలమహానాడు పట్టణ  నాయకులు తీవ్రంగా ఖండించారు. 
ఇప్పటికైనా రాజేష్,మధు లపై అసత్య ఆరోపణలు చేయడం మానుకోవాలని, రాజేష్ అక్రమాలకు పాల్పడ్డాడని ఆరోపణలు చేస్తున్న మధుసూదన్ మంత్రి నర్సింహయ్య దగ్గరికి స్వయంగా రాజేష్ ని తీసుకెళ్ళి పదవి  ఇప్పించింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. గత ఆరు నెలలుగా కుసుమ మధుసూదన్ ప్రవర్తన బాగాలేక   తెలంగాణ మాలమహానాడు కార్యక్రమాలకు పిలవకపోవడంతో  దృష్టిలో పెట్టుకుని కక్షసాధింపు చర్యగా రాజేష్,మధు,ల పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. వారు నిజంగా తప్పు చేసి ఉంటే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ముందుగా పట్టణ, జిల్లా కమిటీకి తెలియజేసి చర్చించి చర్యలు తీసుకోవాలని,  ఇష్టానుసారంగా పత్రికా ప్రకటనలు చేయడం ఎంతవరకు సబబని అన్నారు.
ఎలాంటి ఉద్యోగం చేయకుండా కులసంఘం పేరుతో డబ్బులు,మద్యం కావాలని అందరిని వేదిస్తున్నందనే సంఘానికి దూరంగా ఉంచడంతో మధు  కక్ష్య సాదింపులకు పాల్పడుతున్నాడని వారు ఆరోపించారు.ఇలాంటి అసత్య ఆరోపణలు మానుకోకుంటే అధినాయకత్వానికి మేమే ఫిర్యాదు చేస్తామని వారు హెచ్చరించారు.
ఈ సమావేశంలో  మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు మద్దెల గోపి,నియోజకవర్గ అధ్యక్షుడు దాసరి ప్రతాప్,జిల్లా కార్యదర్శి ఎరుకల నర్సింగ్,పట్టణ వర్కింగ్ ప్రెసిడెంట్ చక్రధర్,పట్టణ కార్యదర్శి శ్రీధర్,పట్టణ గౌరవ అధ్యక్షులు సుంకిత సమ్మయ్య తదితరులు పాల్గొన్నారు.