భూమికి తప్పుడు పాస్ పుస్తకాలు సృష్టించారు: వట్టి కొండ విజయ శేఖర్ రావినూతల గ్రామంలో ఇరు వర్గ

Published: Saturday July 23, 2022
బోనకల్, జూలై 22 పాలన ప్రతినిధి: ఒకే కుటుంబానికి చెందిన ఇరు వర్గాల మధ్య భూ వివాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే శుక్రవారం మండల పరిధిలోని రావినూతల గ్రామంలో 227/ఆ,227/ఇ సర్వే నెంబర్లలో గల సుమారు 5 ఎకరాల వ్యవసాయ భూమిలో సాగుచేసిన సుబాబుల్ పంటను రావినూతల గ్రామానికి చెందిన వట్టికుండ రేణుకమ్మ కుమార్తె లు తాళ్లూరి లక్ష్మీ, తమ్మినేని రజని లు కొంతమంది వ్యవసాయ కూలీలతో కటింగ్ చేపిస్తుండగా ఖమ్మం పట్టణానికి చెందిన వట్టి కుండ విజయ శేఖర్ మరియు వారి కుటుంబ సభ్యులు వచ్చి, 
ఈ పొలానికి సంబంధించిన పూర్తి హక్కులు మావేనని, అడ్డుకోవటానికి ప్రయత్నించగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది, సమాచారం అందుకున్న పోలీసులు ఇరు వర్గాలను పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లడం జరిగినది.
 
వట్టికొండ విజయ్ శేఖర్ వివరణ:
 
మా భూమికి తప్పుడు పాస్ పుస్తకాలు సృష్టించారని,
మా నాన్నగారైన వట్టి కొండ అనంత రాములు ద్వారా నాకు వారసత్వంగా వచ్చిన ఐదు ఎకరాల భూమిని వట్టి కొండ రేణుకమ్మ కుమార్తెలు తాళ్లూరి లక్ష్మీ,తమ్మినేని రజని లు తప్పుడు పాస్ పుస్తకాలు సృష్టించారని, ఇదే విషయంపై తాము న్యాయస్థానికి వెళ్లగా, దీనిపై తీర్పు వెలుపడే వరకు ఆ పొలంలోకి ఎవర్ని ప్రవేశించరాదని న్యాయస్థానం తెలిపినా కానీ సదరు వ్యక్తులు తాళ్లూరి లక్ష్మి తమ్మినేని రజిని పొలంలోకి అక్రమంగా ప్రవేశించడంతో పోలీస్ వారికి సమాచారం అందించగా ఇక్కడికి చేరుకొని ఇరు వర్గాల వారు పోలీస్ స్టేషన్కు రమ్మని తెలియజేశారు లక్ష్మి రజిని తమ దగ్గర వ్యవసాయ భూమికి సంబంధించిన పట్టాదార్ పాస్ పుస్తకాలతో పాటు అన్ని ఆధారాలు తమ దగ్గర ఉన్నాయని పోలీసు వారికి అప్పగించుదామని తెలిపారు.