మహిళ సంక్షేమం కోసం మహిళ ఆరోగ్య కేంద్రాలు జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ మంచిర్యాల బ్యూరో, మ

Published: Thursday March 09, 2023
మహిళల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మహిళా ఆరోగ్య కేంద్రాల ద్వారా మహిళల ఆరోగ్య సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని హమాలివాడలో గల బస్తీ దవఖానలో ఏర్పాటు చేసిన ఆరోగ్య మహిళా కేంద్రాన్ని మంచిర్యాల  శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావు, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా. జి. సి. సుబ్బరాయుడుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళ సంక్షేమం కోసం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ఆరోగ్య మహిళా కేంద్రాలను ప్రారంభించడం జరిగిందని తెలిపారు. , ఈ నేపథ్యంలో జిల్లాలోని జైపూర్ మండలం కుందారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, జన్నారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బెల్లంపల్లి మండలం తాళ్ల గురజాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మంచిర్యాల పట్టణంలోని హమాలివాడలో గల బస్తీ దవాఖానలో ఆరోగ్య మహిళా కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి మంగళవారం ఈ కేంద్రాలలో పరీక్షలు నిర్వహించి తదుపరి చికిత్స అందించేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.