ఇంటర్మీడియట్ ఫలితాలలో వుత్తమ రాంక్ లు సాధించిన విద్యార్థులను సన్మానించిన డా

Published: Tuesday July 05, 2022

కోట రాంబాబు మధిర రూరల్ జూలై 4 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో సోమవారం నాడు కెవిఆర్ హాస్పిటల్ కోట రాంబాబు ముఖ్యఅతిథిగా పాల్గొనిఇటీవలే ప్రకటించిన ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను టీఆరెఎస్ పార్టీ జిల్లా నాయకులు, ప్రముఖ వైద్యులు *డా.కోట రాంబాబు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా డా.కోట రాంబాబు  మాట్లాడుతూ ప్రస్తుతం పోటీ పరీక్షలకు సన్నద్ధం అవుతున్న విద్యార్థులు పాఠ్యాంశాలను క్రమ పద్ధతిలో అభ్యసించడం వలన మెరుగైన ఫలితాలు సాధించేందుకు వీలు ఉంటుంది అని అన్నారు. విద్యార్థులు అత్యుత్తమ స్థాయిలో మార్కులు సాధించేందుకు వారికి పలు సూచనలు చేశారు. మెరుగైన ఫలితాలు సాధించేందుకు కృషి చేసిన అధ్యాపకులను ఆయన అభినందించారు...
ఇ టర్మీడియట్ మొదటి సంవత్సర ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో 3 వ రాంక్ (466/470) సాధించిన మధిరకు చెందిన హోం గార్డ్ మల్లికార్జున్ కుమారుడు చైత్ర తేజ్ ను అభినందించి సన్మానించారు. అదేవిధంగా మధిర లోని పలు కళాశాలలో అత్యధిక మార్కులు సాధించిన ఇంటర్మీడియట్ విద్యార్థులు M. రిత్విక, K. సాహితి, స్.శరణ్య, D. రబియా ఖాతూన్, SK. కరిష్మా, V. ధరణి లను శాలువాలతో సన్మానించి వారికి మేమొంటోస్ అందించారు. ఈ కార్యక్రమంలో సుశీల కళాశాల ప్రిన్సిపాల్ హరినాథ్  అధ్యాపకులు నరసింహారావు , శివ  మరియు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.