మున్సిపాలిటీ పేరు మార్పు పై రామకృష్ణాపూర్ లో సంబరాలు. ..ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్ర పటానికి పా

Published: Wednesday September 14, 2022
సెప్టెంబర్ 13. రామకృష్ణాపూర్. ప్రజాపాలన ప్రతినిధి.
 
క్యాతన్ పెల్లి పేరు తొలగించి రామకృష్ణ పూర్  మున్సిపాలిటీ గా మార్చడం పట్ల ఆ పట్టణవాసులు మంగళవారం సంబరాలు జరుపుకున్నారు. .ఆర్.ఎస్. పట్టణ అధ్యక్షుడు. అబ్దుల్ అజీజ్. ఆధ్వర్యంలో స్వీట్లు పంచి ,టపాసులు కాల్సి తమ సంతోషం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా సూపర్ బజార్ చౌరస్తాలో ప్రభుత్వ విప్ చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ మరియు ముఖ్యమంత్రి కె.సి.ఆర్. చిత్రపటానికి  పాలాభిషేకం   చేసి తమ అభిమానం చాటుకున్నారు. ఈ సందర్భంగా .టి ఆర్.ఎస్. పట్టణ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ
 సిరుల తల్లి సింగరేణి గర్భం నుంచి ఉద్భవించిన ఊరు రామకృష్ణాపూర్ అని ఒకప్పుడు ఎనిమిది భూగర్భ గనులు, ఏరియా వర్క్ షాప్, స్టోర్, టింబర్ యార్డ్, గ్యారేజ్ గనులలో పనిచేసే కార్మికులతో, వారి కుటుంబాలతో రామకృష్ణాపూర్ పట్టణం కళకళ లాడుతూ ఉండేది అని అన్నారు. ఐతె భూగర్భ గనుల కు కాలం చెల్లిపోవడంతో రామకృష్ణ పూర్ పట్టణం తన ఉనికిని కోల్పోయిందని తెలిపారు.
 గతంలో రాష్ట్ర వ్యాప్తంగా  సింగరేణి రాజకీయాలు ఇక్కడి నుండి నడిచేవని , కార్పొరేట్ ని వణికించిన సత్తా ఉన్న లీడర్లు ఉన్న పట్టణం రామకృష్ణ పూర్ అన్నారు. పట్టణ ప్రాముఖ్యత కోల్పోవడంతో ఇక్కడి నుండి రిటైర్డ్ అయిన కార్మికులు, వలస కార్మికులు సొంత ఊర్లకు తిరిగి వెళ్లడం, మంచిర్యాలకు చేరువలో ఉండాలనే ఉద్దేశంతో మంచిర్యాల, తిమ్మాపూర్, గద్దెరాగాడి, క్యాతనపల్లి వైపు అప్పులు చేసి మరీ ఇల్లు కట్టుకొని స్థిరపడుతున్నా రన్నాడు.  గొప్ప చరిత్ర కలిగిన పట్టణానికి పూర్వవైభవం తీసుకురావాలని చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్  తాపత్రయపడి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్  తో మాట్లాడి కొత్తగా ఏర్పడిన క్యాతనపల్లి మున్సిపాలిటీ పేరు ను మార్చి రామకృష్ణాపూర్ మున్సిపాలిటీగా మార్పు చేసినట్లు తెలిపారు. మంగళవారం జరిగిన అసెంబ్లీ సమావేశాలలో స్థానిక ఎమ్మెల్యే బాల్క సుమన్ అబ్యార్థన మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాతన్ పల్లి మున్సిపాలిటీ పేరును రామకృష్ణ పూర్ గా మార్చె నేపథ్యంలో మంత్రి హరీష్ రావు శాసన సభలో ప్రతిపాదన చేశారు. దీంతో పేరు మార్పు లాంచనమే అయ్యింది. ఈ కార్యక్రమంలో  చైర్ పర్సన్ జంగం కల. వైస్ చైర్మన్ సాగర్ రెడ్డి, సీనియర్ నాయకులు గాండ్ల సమ్మయ్య, జాడి శ్రీనివాస్, పుల్లూరి సుధాకర్, రేవెల్లి ఓదెలు,అలుగు శ్రీలత, ఎల్లబెల్లి మూర్తి, యాకుబ్ అలీ, మున్సిపల్ కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, పలు కుల సంఘాల నాయకులు, యూనియన్ నాయకులు, టి.ఆర్.ఎస్. పార్టీ కార్యకర్తలు, మహిళా నాయకురాల్లు పాల్గొన్నారు.