ప్రజా పాలన షాబాద్ :-జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబరాల్లో భాగంగా మండల స్థాయి

Published: Wednesday November 23, 2022
ప్రభుత్వ, ప్రైవేట్  పాఠశాలల నుండి తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం విభాగాల్లో విడివిడిగా విజేతలుగా నిలిచిన పాఠశాలలను జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరిగింది. 
ప్రభుత్వ పాఠశాల నుండి ఇంగ్లీష్ మీడియం విజేతలుగా ఎంపికైన జడ్పిహెచ్ఎస్ (బాలికలు) షాబాద్ విద్యార్థులు 
ఎం పల్లవి, ఆర్ భార్గవి,
 శ్రావణి, 
ప్రభుత్వ తెలుగు మీడియం పాఠశాలల విభాగం నుండి  జడ్పీ హెచ్ ఎస్ (బాలురు) షాబాద్ విద్యార్థులు ఎం రవి, పి శృతి, టీ నందిని జిల్లా స్థాయికి ఎంపికయ్యారు.
 ప్రైవేట్ పాఠశాలల నుంచి ఇంగ్లీష్ మీడియం విభాగానికి సంబంధించి శ్రీ చైతన్య హైస్కూల్ ,నాగర్ గూడ విద్యార్థులు విజేతలుగా జిల్లా స్థాయికి ఎంపికయ్యారు.
ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కార్యదర్శి వెంకటరమణ హాజరై విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ శాస్త్రీయ దృక్పథం అలవర్చుకోవాలని, పాఠశాలలో చదివిన సైన్సును నిత్య జీవితానికి అనువదించుకోవాలని ఆ విధంగా చేసినట్లయితే ఎన్నో శాస్త్ర ఆవిష్కరణలు జరిగి, మన సమాజం శాస్త్రీయ సమాజంగా అభివృద్ధి చెందుతుంది అన్నారు మూఢనమ్మకాలను వదలాలి. ప్రభుత్వాలు మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు
ఈ కార్యక్రమంలో జడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్ ఇంచార్జ్ రాజేశ్వరి గారు, డేవిడ్ గారు మరియు వివిధ పాఠశాలల నుండి హాజరైన ఉపాధ్యాయులు ఝాన్సీ గారు,రమాదేవి గారు,అవిల గారు,చంద్ర శేఖర్ గారు, ప్రసాద్ గారు పాల్గొన్నారు. షాబాద్ మండల్ జనవిజ్ఞాన వేదిక కన్వీనర్ జగదీష్ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు.