శంకరపట్నంలో ఘనంగా హోలీ సంబరాలు శంకరపట్నం07 ప్రజాపాలన రిపోర్టర్

Published: Wednesday March 08, 2023

శంకరపట్నం మండల కేంద్రంలో ఆదర్శ యూత్, వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కుల మతాలకు అతీతంగా మత సామరస్యం విరజిల్లేలా ప్రజలు యువకులు చిన్న పెద్ద అని తేడాలేకుండా రంగులు మయంలో చిరునవ్వులతో హోలీ సంబురాలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఏనుగుల అనిల్ ఆదర్శ యూత్ అధ్యక్షుడు బొంగొని అభిలాష్  వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ వంగోజు సంపత్ సీనియర్ క్రీడాకారులు గుర్రం శ్రీనివాస్, ఆకుల శ్రీనివాస్, ఇలియాస్, సురేష్, చెరుకు శివ, సదానందం తోపాటు గ్రామస్తులు తదితరులు ఈ సంబరాల్లో పాల్గొన్నారు