అర్హులైన నిరుపేదలందరికీ ఆసరా పింఛన్లు ఇవ్వాలి .....సిపిఎం మండల కార్యదర్శి కనికరపు అశోక్. జన్న

Published: Saturday September 03, 2022
రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా అర్హులైన పేదలకు అన్ని రకాల పింఛన్లు మంజూరు చేయాలని సిపిఎం జన్నారం మండల కార్యదర్శి కనికరపు అశోక్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం మంచిర్యాల జిల్లా జన్నారం మండల సిపిఎం పార్టీ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలలో నిర్వహించిన సమావేశాలలో నిరుపేదలు చాలా మంది ఆసరా పింఛన్ల గూర్చి అడుగుతున్నారని తెలిపారు. 57 సంవత్సరాలు నిండిన వారికి, బీడీ కార్మికులకు, వితంతువులకు, వికలాంగులకు, ఒంటరి మహిళలకు, గీత వృత్తిదారులకు, ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో చాలామంది పేర్లు నమోదు కాలేదన్నారు. అర్హులైన వారిని గుర్తించుటకు ప్రభుత్వ అధికారులు పంచాయతీ కార్యదర్శుల ద్వారా సమగ్ర సర్వే చేయించి అర్హులైన పేదలకు ఆసరా పింఛన్లు ఇప్పించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యాక్రమంలో కూకటి కారు బుచ్చయ్య, కొండగుర్ల లింగన్న, ఎస్కే అబ్దుల్లా, తదితరులు పాల్గొన్నారు.
 
 
 
Attachments area