ఆకుకూరలు కూరగాయలలో ముఖ్యంగా శాకాహారంలో అనేక ప్రొటీన్లు

Published: Friday September 17, 2021
బోనకల్, సెప్టెంబర్ 16, ప్రజాపాలన ప్రతినిధి : ఆకుకూరలు కూరగాయలలో ముఖ్యంగా శాకాహారంలో అనేక ప్రొటీన్లు విటమిన్లు మినరల్స్ ఉన్నాయని న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ ఖమ్మం జిల్లా మహిళా అధ్యక్షురాలు కొత్తపల్లి లక్ష్మీదేవి అన్నారు.న్యూ లక్ష్య స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బోనకల్లు మండలం గోవిందపురం (ఎల్) గ్రామంలో బిసి కాలనీలో ఆమె కూరగాయల విత్తనాలు కాకరకాయ సొరకాయ బీరకాయ విత్తనాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆకుకూరలు కూరగాయలు రోజు తినడం వల్ల స్థూలకాయం పోతుందని ఆమె పేర్కొన్నారు. ఆకుకూరల్లో లభించే నూనె పదార్థాలు అధిక రక్తపోటును తగ్గిస్తాయని ఆమె అన్నారు. గుండె సమస్యలను అదుపులో ఉంచుతాయని ఆమె తెలిపారు. ఆకుకూరలు కూరగాయలు మాంసాహారం కంటే అధిక పోషక ఆహార విలువలు ఉన్నాయని ఆమె అన్నారు. ఆకుకూరలు కూరగాయలు ఖనిజాలు పోషకాలు అధిక కంటెంట్ లో ఉంటాయని విటమిన్లు పో లేట్ ఐరన్ మెగ్నీషియం పొటాషియం వంటి పోషక పదార్థాలు ఆకుకూరలు కూరగాయలలో ఉంటాయని ఆకు కూరలు అధిక మోతాదులో తినడం వలన స్థూలకాయ వంటి సమస్య రాదని ఆమె తెలిపారు. ప్రస్తుతం మనం తీసుకునే ఆహారంలో పీల్చుకునే గాలిలో రసాయనాలు అధిక మోతాదులో ఉంటాయని అందుకోసం ఎవరి పరిధిలో వారు మిద్దె, కుండి పంటలు, పెరట్లో దొడ్లలో, పొలాలలో ఆకుకూరలు కూరగాయలు పండించుకోవచ్చు అని  అన్నారు. ఈ కార్యక్రమంలో గరిడేపల్లి దుర్గ, సీత, సుబ్బమ్మ జాన్ బి, లక్ష్మి, హుస్సేన్ బి తదితరులు పాల్గొన్నారు.