వికలాంగుడైన కార్తీక్ గౌడ్ మృతికి కారకులైన పోలీసులను సస్పెండ్ చేయాలి : రాష్ట్ర ప్రధాన కార్యద

Published: Monday October 25, 2021
వికారాబాద్ బ్యూరో 24 అక్టోబర్ ప్రజాపాలన : వికలాంగుడైన కార్తీక్ గౌడ్ మృతికి కారకులైన పోలీసులను సస్పెండ్ చేయాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సిములు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జరిగిన సంఘటనపై పూర్తి విచారణ జరిపించి బాధిత కుటుంబానికి 50 లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరారు.10 అక్టోబర్ 2021న యాదగిరి గుట్ట దర్శనం నిమిత్తం వచ్చిన వికలాంగుడు కార్తిక్ గౌడ్ పై అమాషంగా లాఠీ చార్జ్ చేసి, అతని మృతికి కారకులైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. యాదగిరి గుట్ట టెంపుల్ పోలీసులను వెంటనే ఉద్యోగం నుండి సస్పెండ్ చేసి, వారిని కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సంఘటన పై పూర్తి విచారణ జరిపి బాధిత కుటుంబానికి 50లక్షలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని కోరారు. బాధిత కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇప్పించాలని బివిహెచ్ పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సిములు కోరారు. వికలాంగులపైన దాడులు రోజు రోజుకు పెరిగుతున్నాయని ప్రజలకు రక్షణ కవచంగా ఉండాల్సిన పోలీసులే అభం శుభం తెలియని అమాయక వికలాంగులపై లాఠీ ఛార్జ్ చేసి హత్యలు చేేయడం దురదృష్టకరమని ఆవేదన వ్యక్తం చేశారు. వికలాంగులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని పేర్కొన్నారు. కుటుంబo, సమాజం చేత వివక్షకు గురి అవుతూ దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగులకు రక్షణగా కేంద్ర ప్రభుత్వం 2016 లో తీసుకు వచ్చిన వికలాంగుల అట్రాసిటీ చట్టం 2016 92 సెక్షన్ ను అమలు చేేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా వైఫల్యం చెందాయని విమర్శించారు. చట్టాలను సమర్ధవంతంగా అమలు చేసి దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగుల పట్ల దయ, జాలి, సానుభూతి చూపించవలసిన పోలీసులే వికలాంగులపై లాఠీ ఛార్జి చేసి చంపడం అన్యాయమన్నారు. సంఘం తరుపున రాష్ట్ర వ్యాప్తంగా, డిజిపి ఆఫీస్ ముట్టడి, ప్రగతి భవన్ ముట్టడి చేస్తామని హెచ్చరింంచారు.