మంచిర్యాల జై‌ భారత్ సత్యాగ్రహ సభను విజయవంతం చేయండి మధిర మండలం కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పి

Published: Wednesday April 12, 2023
మధిర ఏప్రిల్ 11 ప్రజా పాలన ప్రతినిధి మధిర మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం మధిర మండల,పట్టణ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సురంశెట్టి కిషోర్ మాట్లాడుతూ..
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల పట్ల వ్యవహరిస్తున్న నిరంకుశ ధోరణికి నిరసనగా మధిర నియోజకవర్గ శాసనసభ్యులు, శాసనసభాపక్ష నేత మల్లు భట్టి విక్రమార్క చేపడుతున్న హాథ్ సే హాథ్ జోడో పాదయాత్రలో భాగంగా ది14.04.2023 శుక్రవారం రోజున రాహుల్ గాంధీ పై అనర్హత వేటు పై నిరసనగా మంచిర్యాల జిల్లా కేంద్రంలో హాథ్ సే హాథ్ జోడో పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ పక్ష నేత మధిర శాసన సభ్యులు భట్టివిక్రమార్క మల్లు ఆధ్వర్యంలో జై భారత్ సత్యాగ్రహ దీక్ష చేపట్టడం జరుగుతుంది.. అనంతరం సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు.. ఈ యొక్క సత్యాగ్రహ దీక్ష కు ముఖ్య అతిథులుగా ఏఐసీసీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గే , రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లట్,*కెసి వేణుగోపాల్ , ముకుల్ వాస్నిక్, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎంపి శ్రీ రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే , రోహిత్ చౌదరి గారు,నదీమ్ జావేద్, తెలంగాణ రాష్ట కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొననున్నారని తెలిపారు. 
కావున మధిర మండలం నుంచి కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు, పట్టణ డివిజన్ కమిటీ అధ్యక్షులు, అనుబంధ సంఘాల అధ్యక్షులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని కోరడమైనది.ఈ సమావేశంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు చావా వేణు, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మిరియాల వెంకటరమణ గుప్తా, మండల ఎస్సీ సెల్ అధ్యక్షుడు దారా బాలరాజు, మండల బీసీ సెల్ అధ్యక్షుడు చిలువేరు బుచ్చిరామయ్య, సోషల్ మీడియా కోఆర్డినేటర్ షేక్ జహంగీర్, పట్టణ బీసీ సెల్ అధ్యక్షుడు బిట్రా ఉద్దండయ్య, కాంగ్రెస్ నాయకులు సంపసాల రామకృష్ణ, రామారావు, పుట్టా పుల్లారావు, పగిడిపల్లి డేవిడ్, ఊట్ల రాంబాబు, మైలవరపు చక్రి మొదలగు వారు పాల్గొన్నారు.