పేరుకే డబుల్ బెడ్ రూంల నిర్మాణాలు

Published: Thursday July 08, 2021
- అర్హులకు ఇంకా ఎందుకు కేటాయించడం లేదు
- బీజేవైఎం పట్టణ ఉపాధ్యక్షుడు బొడ్ల నరేష్
మెట్ పల్లి, జూలై 07 (ప్రజాపాలన ప్రతినిధి) : నిరుపేదల సొంతింటి కల కలగానే మిగిలిపోయిందని బిజెవైఎం పట్టణ ఉపాధ్యక్షుడు బొడ్ల నరేష్ అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ పేదల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని గొప్పలు చెప్పుకుంటున్న టీఆర్ఎస్ ప్రభుత్వం మెట్ పల్లి పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణం పూర్తయిన కానీ ప్రభుత్వం నిర్లక్ష్యం మూలంగా అధికారుల అలసత్వం మూలంగా అర్హులైన నిరుపేదలకు సొంతింటి కల కలగానే మిగిలిపోతుందన్నారు. వెంటనే ప్రభుత్వం చొరవ చూపి అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల కేటాయింపు త్వరితగతిన చేపట్టాలని లేనియెడల ప్రభుత్వంపై పేదల పక్షాన పోరాడుతామని, బీజేవైఎం ఆధ్వర్యంలో అధికారులకు, ప్రజాప్రతినిధులకు గుణపాఠం చెబుతామన్నారు. బీజేవైఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తామని మెట్ పల్లి పట్టణ భారతీయ జనతా యువమోర్చా తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.