మీర్ పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నకిలీ వైద్యుడు

Published: Tuesday June 01, 2021
బాలపూర్, ప్రజాపాలన ప్రతినిధివైద్యవిద్య చదవకుండానే బోర్డు పెట్టుకుని వైద్యం చేస్తున్న నకిలీ వైద్యుడిని మీర్‌పేట పోలీసులు అరెస్టు చేశారు. ఇన్‌స్పెక్టర్‌ మహేందర్‌రెడ్డి వివరాల ప్రకారం.. కర్మన్‌ఘాట్‌కు చెందిన సాయికుమార్‌ మీర్‌పేట కార్పొరేషన్‌ కార్యాలయం ముందు సాయి క్లినిక్‌ నిర్వహిస్తున్నాడు. వైద్యవిద్య చదవకుండానే బోర్డుపై ఎంబీబీఎస్‌ అని పెట్టుకుని కొంత కాలంగా వైద్యం అందిస్తున్నాడు. ఈ మేరకు సమాచారం అందుకున్న మీర్‌పేట పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని విచారించారు. వైద్యవిద్య డిగ్రీకి సంబంధించి అతని వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.