వీ ఆర్ ఏ ల హామీలు నేటి వరకు అమలు చేయని సీఎం వి ఆర్ ఏ ల సంఘం జిల్లా కార్యదర్శి పులుసు వెంకటేశ్వర

Published: Wednesday July 13, 2022

బోనకల్ ,జూలై 13 ప్రజా పాలన ప్రతినిధి:తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకులు సంఘ జేఏసీ పిలుపుమేరకు ఈనెల 25వ తేదీ నుండి సమ్మె చేస్తున్నట్లు వీఆర్ఏల సంఘం జిల్లా కార్యదర్శి పులుసు వెంకటేశ్వర్లు, మండల అధ్యక్షుల మండల అధ్యక్షులు సుధాకర్, మండల కార్యదర్శి కిరణ్ మంగళవారం తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. అనంతర సంఘం అధ్యక్షులు మాట్లాడుతూ సీఎం కేసీఆర్ వీఆర్ఏలకు పే స్కేల్ వర్తింప చేస్తానని మూడుసార్లు అసెంబ్లీ సాక్షిగా హామీ ఇచ్చి నేటి వరకు అట్టి హామీలు అమలు చేయలేదని, తెలంగాణ రాష్ట్ర విఆర్ఏ జేఏసీ పిలుపు మేరకు ప్రతి జిల్లా, మండల స్థాయిలో తాసిల్దార్ కార్యాలయం ముందు ఈనెల 25వ తేదీ నుండి వీఆర్ఏలు సమ్మె చేయాలని వీఆర్ఏలకు విజ్ఞప్తి చేశారు. ఆర్డీవో ఎమ్మార్వో కార్యాలయాల్లో డైరెక్టర్లుగా, కంప్యూటర్ఆపరేటర్లుగా, అటెండర్లుగా వివిధ హోదాల్లో వాళ్ళు పనిచేస్తున్న వీఆర్ఏలను సమ్మెకు సహకరించాలని కోరారు. అర్హత కలిగిన వీఆర్ఏలకు ప్రమోషన్లు కల్పించాలని, 55 సంవత్సరాలు పైబడిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగం కల్పించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వీఆర్ఏ సంఘం డైరెక్ట్ రిక్రూట్మెంట్ జిల్లా ఉపాధ్యక్షులు మరీదు వెంకటేశ్వర్లు,మండల అధ్యక్షులు సుధాకర్, మండల కార్యదర్శి కిరణ్, మండల ఉపాధ్యక్షులు జానకిరాములు, కార్యవర్గ సభ్యులు రంజిత, నాగలక్ష్మి, అప్పయ్య, నాగులు, మీరా, లాజర్, నాగేంద్ర, అక్షిత తదితరులు పాల్గొన్నారు.