ప్రజాసమస్యలపై జోనల్ కమిషనర్ మమతకు వినతిపత్రం ఇచ్చిన జనసేన పార్టీ నాయకులు

Published: Thursday June 17, 2021
కూకట్ పల్లి, జూన్ 16, ప్రజాపాలన ప్రతినిధి : జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నియోజకవర్గం ప్రజాసమస్యలపై బుధవారం జిహెచ్ఎంసి జోనల్ కమిషనర్ వి.మమతకి జనసేన పార్టీ డివిజన్ ప్రెసిడెంట్లు కొల్లాశంకర్, నాగేంద్రబాబు, వెంకటేశ్వరరావు, మహేష్, సూర్య, వినతి పత్రం అందజేశారు. గత సంవత్సరం 2020 వచ్చిన వర్షాల వల్ల కూకట్పల్లి నియోజకవర్గంలో ఉన్న కాలువల నుండి వచ్చిన వరద ముంపుతో నియోజకవర్గంలో ఉన్న బాలనగర్, ఫతేనగర్, మూసాపేట్ లో గల కొన్ని లోగట్టు ప్రాంతాలు మునిగిపోయి ప్రజల ఇళ్లల్లో వరద నీరు వచ్చి ఆస్తి మరియు ప్రాణ నష్టము జరిగి చాలా ఇబ్బంది పడ్డారు గత సంవత్సరం మన గ్రేటర్ హైదరాబాద్ లో కాలువలో పడి ఒక బాలిక మరియు ఈ మధ్య ఒక బాలుడు కాలువలో పడి చనిపోయారు రాబోయే రోజులు వర్షాకాలము కనుక నియోజకవర్గంలో బాలానగర్ (బతుకమ్మ రోడ్డు శోభన కాలనీ భవాని నగర్) మూసాపేట్ లో గల కబీర్ నగర్ లో గల కాలువలకు పెన్షన్లు వేయవలెను కాలువలోని నీరు బయటకు రాకుండా కాలువలను మరమ్మతు చేసి ప్రజల యొక్క ఆస్తులను మరియు ప్రాణాలను కాపాడాలని కొరారు. మూసాపేట్ డివిజన్ లోని కబీర్ నగర్ ప్రాంతంలో నాలా విస్తరణ పనులు పనులను వేగవంతంగా పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాం, ఎందుకంటే రానున్నది వర్షాకాలం కాబట్టి పనులకు ఆటంకం కలగకుండా ఉండాలంటే భారీగా వర్షాలు పడే లోపే పనులు పూర్తి చేసుకున్నట్లయితే.. ఈ ఒక్క సమస్య అనేది ఉండదు. అదేవిధంగా కబీర్ నగర్ ప్రాంతంలో ఈ నాళాల పనుల వల్ల మంచినీటి సరఫరా అనేది గత పది రోజుల నుంచి ఆగిపోవడం జరిగింది.. కావున వెంటనే ఆ వాటర్ పైప్ లైన్ల మరమ్మతులు కూడా త్వరగా పూర్తి చేయవలసిందిగా కోరుతున్నాం, అదేవిధంగా కొన్ని బస్తీలలో రోడ్లు సరి లేక వర్షం వచ్చినప్పుడు బురదతో ప్రజలు నడవడానికి మరియు వాహనాలు పోవడానికి చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మీరు రోడ్ లను మరియు కాలువలను వెంటనే మరమ్మతు చేయించాలని జనసేన పార్టీ తరఫున కోరుతున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం లోని జనసేన పార్టీ వివిధ డివిజన్ ప్రెసిడెంట్లు మాట్లాడుతూ గత ఏడాది జరిగిన వర్షం వల్ల కూకట్పల్లి నియోజకవర్గం లో ప్రజలు చాలా ఆస్తి నష్టం జరిగినది.. ఒక సంవత్సరం పాటు కాలయాపన చేస్తూ  కాలువలను మరియు రోడ్లను ఎటువంటి మరమ్మతు చేయకుండా ఇప్పుడు వర్షాకాలం వచ్చిన సమయంలో ఎమ్మెల్యే గారు కార్పొరేటర్లు మరియు జిహెచ్ఎంసి అధికారులు హడావుడి చేస్తున్నారు అని అన్నారు.. ఇప్పటికైనా నాయకులు, అధికారులు, సీఎం కెసిఆర్ తో సంబంధిత మంత్రులతో మాట్లాడి ముంపు  ప్రాంతములోని కాలువలను మరియు రోడ్లను మరమ్మతు చేయవలెనని కోరారు. ఈ సంవత్సరం వర్షాకాలంలో ప్రజల ప్రాణ నష్టం గాని ఆస్తి నష్టం గాని జరిగితే సీఎం కేసీఆర్, సంబంధిత ఎమ్మెల్యే, సంబంధిత మంత్రి, కార్పొరేటర్లు, మరియు సంబంధిత అధికారులే బాధ్యులు అవుతారు అని అన్నారు. లేనిపక్షంలో జనసేన పార్టీ ప్రజల తరపున మా కార్యాచరణ ప్రకటిస్తాం అని అన్నారు. ఈ కార్యక్రమంలో కూకట్పల్లి నియోజకవర్గలోని జనసైనికులు గోవర్ధన్, వినోద్ కుమార్, సుదర్శన్, దుర్గాప్రసాద్, రాము, వైకుంఠ రావు, పవన్ , కిరణ్, సాయి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.