బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిలోనే, వైద్య సహాయం అందించాలి. ఐఈడి ప్రకారం కార్మికులను ని

Published: Saturday December 31, 2022
బెల్లంపల్లి డిసెంబర్ 30 ప్రజా పాలన ప్రతినిధి: బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రిని  రోజు రోజుకు దిగజారుస్తూ డిస్పెన్సరీ స్థాయికి తీసుకురావడానికి యాజమాన్యం కుట్రలు చేస్తుందని, కుట్రలు మానుకొని కార్మిక కుటుంబాలకు అన్ని రకాల వైద్య సేవలు అందించడానికి స్పెషలిస్ట్ డాక్టర్లను ఏర్పాటు చేసి,  ఏరియా హాస్పిటల్ ను యదా విధంగా కొనసాగించాలని ఐ ఎన్ టి యు సి రాష్ట్ర కార్యదర్శి మత్త మారి  సూరిబాబు అన్నారు.
శుక్రవారం పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో యాజమాన్యాన్ని  హెచ్చరించారు,
బెల్లంపల్లి సింగరేణి ఏరియా ఆసుపత్రి పనితీరుపై  చాలాసార్లు అధికారులకు విజ్ఞప్తి చేయడం జరిగిందనీ, అయినా ఏమాత్రం ఫలితం లేదని అన్నారు.
 సింగరేణి  కార్మికులకు వారి  కుటుంబాల  కోసం  కోట్లాది రూపాయలతో నిర్మించిన ఆసుపత్రిలో  సరైన వైద్య సదుపాయాలు. అందివ్వలేక యాజమాన్యం  కుట్ర పూరితంగా ఇతర ప్రాంతాలకు కేసులను రిఫరల్ పంపిస్తూ, బెల్లంపల్లి ఆసుపత్రినీ డిస్పెన్సరీ స్థాయి కి తీసుకరావడానికి యాజమాన్యం కుట్రలు చేస్తుందని, ఇప్పటికైనా ఆస్పత్రిలో అన్ని విభాగాల్లో స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించి, కార్మికులకు, వారి కుటుంబ సభ్యులకు, రెఫరెల్స్ పంపించకుండా  అన్ని రకాల వైద్య సేవలు ఇక్కడనే అందించాలని ఆయన డిమాండ్ చేశారు.
 యాజమాన్యం  నిర్లక్ష్యం వహిస్తుంటే, ప్రశ్నించాల్సిన  గుర్తింపు సంఘం, అధికార పార్టీ నాయకుల  అండదండలతో హాస్పిటల్లో, సదుపాయాలు  లేకుండా నిర్వీర్యం చేస్తున్నా చూస్తూ ఊరుకుంటున్నారని, దాని ఫలితంగా 
  హాస్పిటల్ లో పని చేస్తున్న కార్మికుల ను ఇతర ప్రాంతాలకు బదిలీ చేస్తున్నారనీ, గతం లో వీరందరిని గుర్తింపు సంఘం  నాయకులు, అధికార పార్టీ  నాయకులు కలిసి లక్షలాది రూపాయలు కార్మికుల దగ్గర లంచాలు గా తీసుకొని ఇక్కడి హాస్పిటల్ కు బదిలీ చేయించినారనీ, ఆ రోజు చెప్పని అభ్యంతరం ఐ ఈ డి డిపార్ట్మెంట్  వాళ్ళు ఈ రోజు అభ్యంతరం ఎందుకు  చెప్పుతున్నారనీ ప్రశ్నించారు.
కార్మికుల దగ్గర లక్షల రూపాయలు తీసుకొని మోసం చేస్తున్నట్టు కాదా, అని అన్నారు.
 ఇప్పటికైనా ఏరియా ఆసుపత్రిలో అన్ని రకాల స్పెషలిస్టులను ఏర్పాటు చేసి, కార్మికులకు వారి కుటుంబ సభ్యులకు రెఫరల్ పంపించకుండా ఇక్కడే వైద్య సహాయం అందించాలని, ఆసుపత్రిలో ఐఈడి స్టడీ ప్రకారమే సరిపోయేంత కార్మికులను నియమించాలని ఇఎన్టియుసి డిమాండ్ చేస్తుందని అన్నారు.