సెకండ్ వేవ్ కరోనా పై అవగాహన

Published: Thursday April 29, 2021
మధిర ప్రజా ప్రతినిధి 28వ తేదీఈ రోజు మండల పరధిలో phc దెందుకూరు ఏరియా లోని శ్రీరామ్ నగర్ సరిహద్దులొ పనిచేస్తున్న సుభాబుల్ లోడ్ చేస్తున్న రైతు కూలీలకు జిల్లా వైద్య అధికారుల ఆదేశాల మేరకు Phc ఇంచార్జ్ వైద్య అధికారిణి dr పుష్పలత మరియు గ్రామ ప్రధమ పౌరు రాలు (సర్పంచ్ )శ్రీమతి కోట విజయశాంతి వెంకటకృష్ణ గార్ల సూచనల మేరకు గ్రామoలో కరోనాపై ప్రజలకు సంపూర్ణo గా అవగాహనా కార్యక్రమం చేపట్టడం జరిగినది అని phc ఆరోగ్య పర్య వేక్షకుడు లంకా కొండయ్య తెలిపినారు. ఇందులో భాగంగా ఈ శ్రీరామ్ నగర్ ఏరియా లొ కూలీలకు సంపూర్ణoగా అవగాహన పరిచినారు. ఈ సందర్బంగా కొండయ్య మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా విలయ తాండవం చేస్తున్న తరుణంలో  ప్రతి ఒక్కరు కరోనా రూల్స్ పాటించాలి అని  ఎవరికైనా covid లక్షణాలు  ఉంటెనే ప్రభుత్వ హాస్పిటల్ కు రావాలని  ఒక ఇంటిలో ఎవరి కయినా కరోనా పాజిటివ్ ఉంటె ఆ వ్యక్తి కుటుంబంనకు చెందిన ప్రైమరీ కాంటాక్ట్ వ్యక్తులు 5 రోజులు తరువాత హాస్పిటల్ కీ వచ్చి పరీక్షలు చేయిoచు కోవాలని సూచించారు. బౌతిక దూరం, చేతులు శుభ్రం, మాస్క్ ధరించటం  సాధ్యమైనంత వరకు ఇంటి పట్టున ఉండటం వంటి పలు విషయాలు సంపూర్ణ ముగా వివరించారు. ఈ కార్యక్రమంలొ ఆరోగ్య సిబ్బంది దెందుకూరు జి పి సిబ్బంది పాల్గొన్నారు.