బడ్జెట్ పెరిగింది తప్పా.. కల్యాణ లక్ష్మీ పథకం నిధులు పెరగలేదు కళ్యాణ్ లక్ష్మి చెక్కుల పంపిణ

Published: Tuesday February 21, 2023
బోనకల్, ఫిబ్రవరి 20 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రములోని రైతు వేదికనందు కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు మంజూరైన చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్బంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ ఆడపిల్లలు పుడితే భారం అనుకునే సంఘటనలు చూసి పేద కుటుంబంలో పుట్టిన ఆడపిల్లలు ఇబ్బంది పడకూడదని ఉద్ధేశంతో కాంగ్రెస్ హయాంలో బంగారు తల్లి పథకాన్ని తీసుకొచ్చామని గుర్తు చేశారు.బంగారు తల్లి పథకంతో పేదింటి కుటుంబాల్లో వెలుగూ నింపినట్లు తెలిపారు.తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాడు బడ్జెట్ నేడు బడ్జెట్ మూడూ లక్షల కోట్లకు పెరిగిందని కానీ కల్యాణ లక్ష్మీ పథకానికి మాత్రం లక్ష నూట పదహర్లు మాత్రమేనని ఇస్తున్నారని అన్నారు.పెరిగిన బడ్జెట్ ప్రకారం పథకానీకి ప్రభుత్వం నిధులు పెంచుకుంటే బాగుంటదని ఆ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందనీ అన్నారు. ఆర్హులైన ప్రతీ ఒక్కరికీ కల్యాణ లక్ష్మీ పథకాన్ని అమలు చేయాలని కోరారు.ఆర్ధికంగా సామాజికంగా వెనుకబడిన కులాల వారికి ప్రభుత్వ పథకాలు అందించాలని కోరుకునే వాళ్ళలో తాను ముందుంటనని అన్నారు.అనంతరం మండలంలో ఉన్న మొక్కజొన్న రైతులు తమ ఆవేదనను భట్టి విక్రమార్కదృష్టికి తీసుకువెళ్ళారు.భట్టి విక్రమార్క అధికారులతో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించి వీలైనంత త్వరగా సమస్య పరిష్కారం అయ్యే దిశగా ప్రయత్నం చేయాలని తాను కూడా ఉన్నతాధికారులతో మాట్లాడతాని తెలిపారు.రెగ్యులేటర్ లేకపోవడం వల్ల సమస్య తలెత్తుతుందని దానిని పరిష్కరించాలని రైతులు కోరారు.ఈ కార్యక్రమంలో టిపీసీసీ సభ్యులు పైడిపల్లి కిషోర్ కుమార్,మండల కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి దుర్గారావు, జెడ్పీటీసీ సభ్యులు మోదుగు సుధీర్ బాబు,కలకోట సొసైటీ చైర్మన్ కర్నాటి రామ కోటేశ్వరరావు,జిల్లా డిసిసి కార్యదర్శి బంధం నాగేశ్వరరావు,మధిర నియోజక వర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఉమ్మినేని రమేష్,
వైస్ ఎంపీపీ గుగులోత్ రమేశ్,మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు నల్లమోతు సత్యనారాయణ,ఎస్సీ సెల్ అధ్యక్షుడు మారుపల్లి ప్రేమ్ కుమార్,బీసీ సెల్ అధ్యక్షుడు కందుల పాపారావు,సర్పంచ్ లు భాగం శ్రీనివాసరావు,సుబ్బారావు,రవి,యూత్ కాంగ్రెస్ మండల అద్యక్షుడు భూక్యా భద్రు నాయక్,ఆయా గ్రామాల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.