సీఎం సహయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే సంజయ్ కుమార్

Published: Monday May 17, 2021
సీఎం కేసీఆర్ విపత్కర పరిస్థితుల్లో అపత్బందవుడు
జగిత్యాల, మే 16, (ప్రజాపాలన ప్రతినిధి) : జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం సీఎం సహాయనిధి చెక్కులను ప్రయివేటు ఆసుపత్రులలో వివిధ రకాలైన శస్త్రచికిత్సలు చేసుకున్న 65 మంది లబ్ధిదారులకు 19 లక్షల 57 వేల రూపాయలు విలువగల చెక్కులను స్థానిక ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలు కరోనా విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పుడు సంక్షేమం ఆపకుండ అపత్బండవుడు అయ్యాడని అన్నారు. ప్రజలు కరోనా విషయంలో జాగ్రత్తగా ఉండాలని మస్కులు ధరించి భౌతిక దూరం పాటించాలని కోరారు. కరోనా చికిత్సలకు చెల్లించిన బిల్లులకు సీఎం కేసీఆర్ మానవత దృక్పథంతో సీఎం సహయనిధి ద్వారా లబ్ధిదారులకు మంజూరు చేయడంపట్ల సీఎం కు ధన్యవాదాలు తెలిపారు. ప్రయివేట్ ఆసుపత్రులలో కరోనా స్కానింగ్ సెంటర్లలో 2 వేలకు మాత్రమే చెస్ట్ స్కానింగ్ చేసే విదంగా ధర నిర్ణయించడం జరిగిందని తెలిపారు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా రోగులకు కేవలం 30 బెడ్స్ మాత్రమె ఉంటే జిల్లాలో 24 ఆసుపత్రులలో కరోనా చికిత్సలకు అనుమతులు ఇచ్చామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గట్టు సతీష్ కౌన్సిలర్స్ పిట్ట ధర్మరాజు తోట మల్లికార్జున్ కోరే గంగమల్లు అల్లే గంగసాగర్ చుక్క నవీన్ వానరాసి మల్లవ్వ తిరుమలయ్య ఓల్లెపు రేణుకమోగిలి కూతురు రాజేష్ క్యాదాసు నవీన్ బొడ్ల జగదీశ్ కూతురు పద్మ సిరికొండ భారతి దాసరి లావణ్య పంబాల రాము నాయకులు బోగ ప్రవీణ్ ఆనంద్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.