అమ్మే నాకు ఆదర్శం ఆడపిల్ల నని నన్ను చిన్నచూపు చూడలేదు తహసీల్దార్ సుమ

Published: Tuesday March 09, 2021
పాలేరు, మార్చి 8, (ప్రజాపాలన ప్రతినిధి) : ఖమ్మం జిల్లా నేలకొండపల్లి ఆడ పిల్లనని చూడకుండా నన్ను ఇంతటి ప్రయోజకురాలిని చేసిన మా అమ్మే నాకు ఆదర్శమని నేలకొండపల్లి తహసీల్దార్ తాళ్లూరి సుమ అన్నారు. సోమవారం నేలకొండపల్లి మండలంలోని కొత్త కొత్తూరు గ్రామంలో ప్రపంచ మహిళా దినోత్సవం సందర్భంగా టీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు చెర్వు స్వర్ణ ఏర్పాటు చేసిన సదస్సులో ఆమె మాట్లాడుతూ ఆనాడు తన తల్లి, తండ్రులు ఆడపిల్లలని చూడకుండా చదివించడం వల్లనే ఈ రోజు తాను తహసీల్దార్ గా, తన చెల్లెలు ఎక్సైజ్ సిఐగా ఈలాంటి ఉన్నత ఉద్యోగాల్లో ఉన్నామన్నారు. కూతురైనా, కుమారుడైనా సమానమే అన్నారు. తల్లి, తండ్రులు సమాజం పట్ల పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి మహిళ స్వశక్తితో ఎదగాలన్నారు.అబివృద్ది చెందాలంటే విద్యతోనే సాద్యమన్నారు. ప్రతి మహిళా విద్యావంతులు కావాలని పిలుపునిచ్చారు.అనంతరం నేలకొండపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ రాయపూర్ నవీన్ గౌరవ మహిళ వార్డు సభ్యులను, మరియు ఎంపీటీసీ సభ్యులను శాలువా కప్పి సన్మానించరు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ రాయపూడి నవీన్, ఎంపీటీసీ సభ్యులు బొడ్డు బాలయ్య, మరియు వార్డు సభ్యులు, గొలుసు రవి, నాగిరెడ్డి, దోసపాటి శేఖర్, తదితరులు పాల్గొన్నారు